చేవెళ్లటౌన్, మే 2: స్వరాష్ట్రంలో సర్వమతాల పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వీరయ్య ఫంక్షన్ హాల్లో జడ్పీటీసీ మాలతి ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మతసామరస్యాన్ని చాటి చెబుతాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ కామర్, ఆర్ఐ రాజేశ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు మాణిక్య రెడ్డి, నర్సింలు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని మొండివాగు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నాయకుడు రమణారెడ్డి పాల్గొన్నారు.
ముస్లింలకు దుస్తుల పంపిణీ
హయత్‌నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలువురు పేద ముస్లింలకు సర్పంచ్ తుడుము మల్లేశ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్ దుస్తులు పంపిణీ చేశారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
నర్సప్పగూడలో
నందిగామ : నర్సప్పగూడ గ్రామంలో సర్పంచ్ గోవిందు అశోక్ ఆధ్వర్యంలో రంజాన్ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కట్న శేఖర్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ కళమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సురేందర్ పాల్గొన్నారు.
రంజాన్ కానుకలను అందజేసిన సర్పంచ్
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో ముస్లింలకు సోమవారం రంజాన్ కానుకలను సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో అందజేశారు. ఈద్గా వద్ద అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ముస్లింలు పాల్గొన్నారు.