రంగారెడ్డి, ఏప్రిల్ 25,(నమస్తే తెలంగాణ): అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పట్లోళ్ల సబితారెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వానకాలం సాగు సన్నద్ధంపై రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొహెడ పండ్ల మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని, ఈ పనులకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్ల సాగు విస్తీర్ణం పెరిగేలా కృషి చేయాలన్నారు. భూమి నిస్సారమైతే ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సహజమైన ఎరువులు, ఒండ్రు మట్టిని పొలాల్లో వేసేలా ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరి కన్నా ఇతర పంటలతోనే అధిక లాభాలు పొందొచ్చన్నారు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న నూనె, పప్పు ధాన్యాల పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో వానకాలం సీజన్ సన్నద్ధంపై రం గారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులకు వర్క్‌షాప్ జరిగింది. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌కు, ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలోనే కొహెడ మార్కెట్ శాశ్వత నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగు పెంచేలా కృషి చేయాలని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డికి ఆయన సూచించారు. అదేవిధంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, చెరువుల్లోని ఒం డ్రు మట్టిని పొలాల్లో వేసేలా ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వరి కంటే ఇతర పంటలే మేలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ప్రొ.జయశంకర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల జడ్పీ చైర్మ న్లు తీగల అనితారెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్లు గణేశ్, విజయ్‌కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మూడు జిల్లాల రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల ఎంటీలకు పెరిగిన ధాన్యం దిగుబడి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గతంలో పంట సాగు ప్రణాళిక, వరి సాగుకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తావన వచ్చేదికాదు.. కానీ మిషన్ కాకతీయతో సాగు నీరు అందటంతో మూడేండ్లలో వరి సాగు గణనీయంగా పెరిగిందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో ఐదు వేల మెట్రిక్ టన్నుల ధా న్యం దిగుబడి రాగా, ప్రస్తుతం ఐదు లక్షల మెట్రి క్ టన్నులకు దిగుబడి పెరిగిందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్-వికారాబాద్ రహదారిలో కూరగాయల వాహనాలు క్యూ కట్టేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న దృష్ట్యా కూరగాయల సాగు పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి వ్యవసాయాధికారులకు సూచించారు.
న్యూ సిటీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ;రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ ఓల్డ్ సిటీ అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా న్యూసిటీ అని, ధనిక నగరం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు బెంగళూరు నుంచి పూలు వస్తున్నాయ ని.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి చెక్ పెట్టాలన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పూలు, కూరగాయల పంటల సాగును అధిక మొత్తంలో పెంచాలని వ్యవసాయాధికారులకు ఆయన సూచించారు.