ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25: ఓవైపు ఫ్లోరైడ్ సమస్య…మరోవైపు వేసవిలో తాగునీటి కష్టా లు..ఏ గ్రామంలో చూసినా తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకునేవారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని రూ రల్ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడేవారు. ఈ పరిస్థితి నుంచి ప్రజల ఇబ్బందులను మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభు త్వం తీర్చింది. మిషన్ భగీరథ ద్వారా అవసరమైన గ్రామాలకు నూతనంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించడమే కాకుండా అదనంగా పైపులైన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు నల్లా కనెక్షన్లను ఇచ్చింది.
దీంతో రూరల్ మండలాలైన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మె ట్ మండలాల్లోని 125 గ్రామాలకు మిషన్‌భగీరథ ద్వారా పూర్తిస్థాయిలో ప్రభుత్వం తాగునీటి ని అందిస్తున్నది. ఈ గ్రామాలకు ప్రతిరోజూ 1.95 కోట్ల లీటర్ల తాగునీటిని అందిస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో యాచా రం మండలంలోని మంతన్‌గౌరెల్లి, మాల్, చిం తపట్ల, నల్లవెల్లి, మంచాల మండలంలోని బోడకొండ, లోయపల్లి, ఎల్లమ్మతండా, చెన్నారెడ్డిగూ డ, పీసీతండా, కొర్రవానితండా, సత్తితండా తదితర గ్రామాల్లోని ప్రజలను ఫ్లోరైడ్సమస్య తీవ్రం గా వేధించేది. ప్రజలు అనేక దీర్ఘకాలిక రోగాలబారిన పడేవారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన మిషన్ భగీరథ పథకంతో ఆ బాధలన్నీ తప్పాయి. ప్రస్తుతం ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది.
రూరల్ ప్రాంతాలకు ప్రతిరోజూ 1.95 కోట్ల లీటర్ల తాగునీరు
నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని 127 గ్రామాలకు ప్రతిరోజూ 1.95 కోట్ల లీటర్ల మిషన్ భగీరథ తాగునీటిని ప్రభుత్వం అందిస్తున్నది. దీంతోపాటు ఆ యా గ్రామపంచాయతీల్లో గతంలో ఉన్న బోర్లతోపాటు కృష్ణాజలాలనూ అదనంగా సరఫరా చేస్తున్నది. దీంతో అన్ని గ్రామాల్లోని ప్రజలకు అవసరానికి మించి తాగునీరు అందుతున్న ది.
అదనంగా 99 ట్యాంకులు..
నియోజకవర్గంలోని రూరల్ మండలాల్లో గతం లో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు అదనంగా మరో 99 కొత్త ట్యాంకులను మిషన్‌భగీరథ పథకం కింద నిర్మించారు. ఇబ్రహీంపట్నం మం డలంలో 20, మంచాలలో 29, యాచారంలో 28, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 22 కొత్త ట్యాంకులను నిర్మించారు. వీటి ద్వారా ఆయా గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలంలో 105.42 కిలోమీటర్లు, మంచాలలో 12,352కిలోమీట ర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 85,09 కిలోమీటర్లు, యాచారంలో 134.37 కిలోమీటర్ల చొప్పున అదనపు పైపులైన్లను ఏర్పాటుచేశారు. రూరల్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం కింద ఇబ్రహీంపట్నం మండలంలో 21 గ్రామాలు, మం చాలలో 33 గ్రామాలు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26 గ్రామాలు, యాచారం మండలంలో 45 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు.
44,137 నూతన నల్లా కనెక్షన్లు..
నియోజకవర్గంలోని రూరల్ మండలాల్లో గతం లో ఉన్న నల్లా కనెక్షన్లకు అదనంగా మిషన్‌భగీరథ కింద 44,137 కొత్త నల్లా కనెక్షన్లను ఇం టింటికీ ఇచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం, మం చాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలా ల్లో నల్లా కనెక్షన్లు లేని ఇల్లు ఒక్కటికూడా లేదు. గిరిజన గ్రామాల్లోనూ ఇంటింటికీ నల్లా కలెక్షన్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది
మిషన్ భగీరథతో తీరిన నీటి కష్టాలు
ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంత గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ సరిపడా తాగునీటిని అందిస్తున్నాం. నియోజకవర్గంలోని నాలుగు మం డలాల్లోని 125 గ్రామాలకు ప్రతిరోజూ 1.95 కోట్ల లీటర్ల తాగునీటిని అందిస్తున్నాం. అదనంగా మరో 99 ట్యాంకులను నిర్మించి ప్రజలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది.
– రాజు, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ