కొడంగల్, ఏప్రిల్ 24 : మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలో పది కాలాలపాటు చెదరని ముద్ర వేయాలంటే అది అందమైన చేతిరాతతోనే సాధ్యం.. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే అబ్బాయి నుంచి కోటి ఆశలతో కళాశాలలకు వెళ్లే యువత వరకు అందమై దస్తూరికోసం ఆరాట పడుతుంటారు. నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్, సెల్ ఫోన్ ప్రాముఖ్యత పెరిగి చేతి రాతకు కొంత వరకు లోపం ఏర్పడుతుంది. కానీ నేటికీ చేతి రాతకు ప్రాధాన్యత ఏమాత్రం ఆదరణ తగ్గిపోలేదు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కంప్యూటర్ యుగంలో..
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో చేతిరాత చేజారిపోపతుంది. రాసే అలబాటు తగ్గిపోవడం వల్ల ముత్యాల్లాంటి అక్షరాలు కనుమరుగవుతున్నాయి. అక్షరాలను జాలువార్చే చేతి వేళ్లు కంప్యూటర్, సెల్ ఫోన్ల కీ బోర్డుపై నాట్యమాడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో చేతిరాత అవసరాలు తగ్గిపోయి ప్రతీదీ కంప్యూటర్ సహాయంతో పనులు చేపడుతున్నారు. అప్పట్లో చేతిరాతతో ఆర్టిస్టులు పెద్ద పెద్ద బోర్డులు రాసేవారు. ప్రస్తుతం వారికి ఉపాధి కరువైపోయింది. చేతిరాత పని లేకుండా కంప్యూటర్లో ఫ్లెక్సీలు ఫ్యాషన్‌గా మారిపోయాయి. చిన్న పాటి ఫిర్యాదు పత్రాన్ని రాయాలన్న కంప్యూటర్ సెంటర్‌ను ఆశ్రయించి డీటీపీ చేసి అందిస్తున్నారు. ఈ రోజుల్లో ముత్యాల్లాంటి అక్షరాలు రాసే వారిని చూస్తే ఇట్టే ఆకర్షితులం కాక తప్పదు. అంటే ఆధునిక యుగంలో కూడా చేతిరాతకు అంతే ప్రాధాన్యత ఉందని స్పష్టం అవుతున్నది. చిన్నప్పుడు పాఠశాలలో చేతిరాత పుస్తకాలతో చేతి వ్రాతను మార్చుకునే విధంగా ఉపాధ్యాయులు తోడ్పడేవారు. కానీ పెద్ద తరగతులు, కళాశాలలో అటువంటి ఇటువంటి వీలుండదు. కాబట్టే మనంతటికి మనమే సాధన చేసుకొని చేతిరాతను మార్చుకోవాలి.
పరీక్షల సమయం..
పఠనంతో పాటు చేతిరాతను కూడా పెంపొందించుకుంటే అటు చదివింది మర్చిపోకుండా ఉండటంతో పాటు, చేతిరాతకు సాధన చేసినట్లుగా కూడా ఉంటుంది. విద్యార్థులు ఈ దిశగా సాధన చేస్తే పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. గతంలో సమాధానం పత్రాలు గీతలు ఉండేవి, ప్రస్తుతం అన్ని పరీక్షలకూ ఎటువంటి గీతలు లేని తెల్ల కాగితాలను ఉపయోగిస్తున్నారు. చేతిరాత అలవాటు చేసుకోవం చాలా ముఖ్యం. మనం రాసే ప్రతి అక్షరం చదివే వారికి ఇట్టే అర్థమవుతే ఎక్కువ మార్కులు వేసే వీలుంటుంది, అదే అర్థం కాకపోతే విసిగి వేసారి తోచినంతగా మార్కులు వేస్తారు.
సాధనతోనే మార్పు..
మనం రాసేటప్పుడు కూర్చునే విధానం, పెన్ను పట్టుకునే భంగిమ కాగితానికి, కలానికి మధ్య దూరం వంటి అన్ని అంశాలు చేతిరాతకు ముఖ్యప్రాత పోహిస్తాయి.
బాల్ పాయింట్ పెన్ కన్నా సిరాపెన్తో రాయడం అనుకూలంగా ఉంటుంది. దీంతో కొంత వరకు చేతిరాత కూడా మెరుగుపడుతుంది.
సున్న, అరసున్న, నిలువు గీతలను బాగా సాధన చేస్తే చేతిరాత మారే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆంగ్లం, తెలుగు, భాషల్లో మెరుగైన రాత కోసం అవసవ్యద దిశలో, హిందీ భాషకు సవ్యదిశలో రాయడం సాధన చేసుకోవాలి.
విద్యార్థులు గుర్తించుకోవాల్సి అంశాలు..
జవాబుల్ని సూటిగా చెప్పాలి. సమాధానాలు టీచర్లకు సులువుగా గుర్తించాలి. కానీ మనం రాసే తీరు పరీక్షా పేపరు దిద్దే వారిని ఇబ్బందులు పెట్టేవిధంగా ఉండరాదు.
వ్యాక్యాలు తప్పులు లేకుండా చూసుకోవాలి.
కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25 నుంచి 30 వరుసలు రాస్తారు. అది చూసేవారికి ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్కో పేజీలో 16 నుంచి 18 వరులకు మించి రాయకూడదు.
ఒక పాయింట్ వద్ద మొదలైన రాత ఆ లైన్ చివరికి వెళ్లే సరికి పైకో, కిందికో పోకుండా జాగ్రత్త వహించాలి.
మొదటి లైను రాసే సమయంలోనే మార్జిన్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి.
గీత చివరకు వరకు రాస్తూ, చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి.. మరో సగాన్ని కిందిలైన్లో రాయకూడదు. అలా రాస్తే పదం యెక్క అర్థం వీగిపోతుంది. దాంతో దిద్దేవారికి ఇబ్బంది కలుగుతుంది, అలా రాయాల్సి వస్తే చివరిన – ఇలా గుర్తు చేస్తే పదానికి ముందు ముగింపు ఉందని గుర్తు చేస్తుంది. కొట్టివేతలు ఎక్కువగా ఉంటే మార్కులు తగ్గుతాయని గుర్తించుకోవాలి.
చాలా మంది సమాధాన పత్రంలో బాగా వత్తి పట్టి రాసే అలవాటు ఉంటుంది. ఆ విధంగా రాయడం వల్ల రాసిన ప్రతి అక్షరం వెనుక భాగంలో ఉబ్బినట్లుగా కనిపిస్తున్నది. వెనుక భాగాన రాయాలంటే అక్కడ, ఇక్కడ పదాలు కలిసినట్లుగా కనిపిస్తాయి. రాసేటప్పుడు పెన్నును చేతివేళ్లతో గట్టిగా పట్టుకోకుండా వీలైనంత వరకు నెమ్మదిగా పట్టుకొని రాయాలి.
అంకెలు రాసేటప్పుడు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్ష సమయాన్ని బట్టి తొందరగా పరీక్షను ముగించాలనే ఆతృతతో అక్షరాలపై ధ్యాస పెట్టలేకపోతారు. అక్షర రూపం మారిపోయి మార్కులు దెబ్బతింటాయి. ఉదాః 2ను ఇంగ్లిష్ zగా. 5ను s ఆకారంలో, 0ను 6 తరహాలో రాయడం జరుగుతున్నది. దిద్దే వారికి అర్థం కాక కొట్టివేసే ప్రమాదం ఉంది.
సామాన్య శాస్త్రంలో బొమ్మల్ని గీసే, ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఓ క్రమ పద్ధతిని పాటించాలి.
పరీక్షల్లో కొంతసేపు రాత కోసం, పేజీ అలంకరణకు సమయాన్ని కేటాయించుకోవాలి. జవాబు
పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే, వాటిని పెన్సిల్‌తో లేదా పెన్‌తో బాగా రుద్దుతారు దీంతో ఆ ప్రాంతంలో పేపర్ నల్లగా వికారంగా కనిపిస్తుంది.
అక్షరాన్ని ఇలా రాయాలి…
పరీక్ష సమయంలో పేజీకి పై భాగంలో ఒక అంగుళం ఎడమ వైపు అదే స్థాయిలో కుడివైపు మార్జిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాధ్యాయులు రాసిన పేజీలను దారంతో కట్టిన రాసిన అక్షరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జవాబు పత్రంలో బొమ్మల్లోని భాగాన్ని, ఒక వైపు సరళ లేఖల్ని గీసి భాగాల పేర్లు రాయాలి.