టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
ధారూరు, ఏప్రిల్ 19: ప్రతి కార్యకర్త కార్యదీక్షతో పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కార్యదీక్షతో పనిచేసి పార్టీని పతాక స్థాయి లో నిలబెట్టాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు సహసంతో పనిచేయాలన్నారు. పార్టీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
అయితే పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సొప్పరి వెంకటయ్య, వేణుగోపాల్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, రాములు, జైపాల్ రెడ్డి, అంజయ్య, దేవేందర్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, లక్ష్మయ్య, వెంకట్ రామ్ రెడ్డి, శ్రీనివాస్, గోవింద్ రాజ్ గౌడ్, మా ణిక్యం, రవికుమార్, అనంతయ్య, విజయ్‌కుమార్, హన్మయ్య, చంద్రయ్య, యాద య్య, చంద్రమౌళి, వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.