షాబాద్, ఏప్రిల్ 18: ‘పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు.. అందుకే నగరం నలువైపులా టిమ్స్ వంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నెలకొల్పడం జరుగుతుంది..’ అని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆరోగ్య మేళాను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారుతున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా జరిగేలా డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డిజిల్లాకు రానున్న కాలంలో వైద్య కళాశాల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు ప్రకటించినట్లు తెలిపారు. కరోనా సందర్భంగా చేసిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 5డివిజన్లలో ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం, విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె మెగా హెల్త్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలోని ఐదు డివిజన్లలో 18 నుంచి 22వ తేదీ వరకు మెగా హెల్త్ మేళాలు జరుగుతాయన్నారు. సామా న్య, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యా న్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అందులో భాగంగానే నగరం నలువైపులా టిమ్స్‌లాంటి మల్టీసూపర్ స్పెషాలిటీ దవాఖానలను నెలకొల్పడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు కానున్నదన్నారు. దవాఖానకు పోతే వైద్యుడి ఫీజు కంటే వివిధ రకాల పరీక్షల ఫీజే భారంగా మారడంతో.. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా జరిగేలా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, చేవెళ్లలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్ వైరస్ కట్టడిలో వైద్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, మీడియా వారిని మంత్రి అభినందించారు. జ్వర సర్వే నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజల హెల్త్ ప్రొపైల్‌ను తయారు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి కూడా స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని చెప్పవచ్చని ఆమె పేర్కొ న్నారు. నగరంలో సత్ఫలితాలు ఇచ్చిన బస్తీ దవాఖానలను పల్లెల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీపీ, షుగర్ ఉన్నవారికి మందులతో కూడిన కిట్లను కూడా అందించనున్నట్లు తెలిపారు. అనంతరం రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే కాలె యాద య్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశారని.. ప్రజలందరికీ వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు.
వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు సలహాలు, సూచనలు అందించి వారు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, ఉప వైద్యాధికారి డాక్టర్ దామోదర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచ్ శైలజ, ఎంపీటీసీ వసంతం, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీవో రాజ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యు డు ప్రభాకర్‌రెడ్డి, సీడీపీవో శోభారాణి, వైద్యులు రాజశేఖర్, రఘుబాబు, సృజన, టీఆర్ఎస్ నాయకులు బాల్‌రాజ్, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, మాణిక్యరెడ్డి, మల్లారెడ్డి, నర్సింహులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.