పెద్దేముల్, ఏప్రిల్ 18: తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం భట్,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు నూతన ఆరోగ్య సబ్ సెంటర్లు మంజూరయ్యాయని అడికిచెర్ల, పెద్దేముల్, కందనెల్లి గ్రామాల్లో త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదే విధంగా 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరిస్తామన్నారు.
మెగా వైద్య శిబిరాన్ని అన్ని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగ పరుచుకొని ప్రతి ఒక్కరూ ఆరో గ్యంగా సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు.అనంతరం మెగా వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వైద్యులతో, రోగులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం భట్, ఉపవైద్యాధికారి ధరణికుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ మహేశ్, సర్పంచ్ ద్యావరి విజయమ్మ, ఎంపీపీ అనురాధ రమేశ్, జడ్పీటీసీ ధారాసింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, రమేశ్, గోపాల్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో వాహనాల రద్దీ దృష్ట్యా రోడ్డు మధ్యలో డివైడర్‌తోపాటు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటనే డీఈతో ఫోన్లో మాట్లాడి త్వరలో మంబాపూర్ గ్రామంలో డివైడర్‌తోపాటు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే
మండల పరిధిలోని గాజీపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా పశుగణానాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.నారాయణ రెడ్డిని సోమవారం గాజీ పూర్లోని ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరామర్శించారు.నారాయణ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం బుద్దా రం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి కలిసి పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట తాండూరు మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.