కొత్తూరు, ఏప్రిల్ 18: రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే నాణ్యతలో ఏమాత్రం రాజీ పడేదిలేదని స్పష్టం చేశారు. పెద్ద వాహనాలు రోడ్డుపైకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. రోడ్డు చిన్నగా ఉన్నందును రోడ్డు పక్కల మట్టిపోసి ఎదురుగా వచ్చే వాహనాలు దిగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ రాజేందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగగళ్ల శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
స్వచ్ఛ కొత్తూరును సాధిద్దాం
స్వచ్ఛ కొత్తూరు సాధనకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. స్వచ్ఛ భారత్ నిధులు రూ. 6 లక్షలతో కొత్తూరు దర్గా రోడ్డులో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూ చించారు. మున్సిపాలిటీలో మరిన్ని మరుగుదొడ్లను నిర్మించేందుకు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ వీరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీ ందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్, బ్యాగరి యాదయ్య, కమ్మరి జనార్దన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాసుల లక్ష్మయ్య, రామకృష్ణ, బాల్‌రాజ్, రాఘవేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.