పరిగి, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు నిజం కావాలంటే ప్రతిఒక్కరూ చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్‌లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో ఆమె పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది మహనీయుల వేడుకలు అంబేద్కర్ భవ న్, బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లలో నిర్వహించే లా చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.గ్రామాల్లోని విద్యావంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారం భం కానున్న ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు రాణించేలా ప్రతిరోజూ అరగంట సేపు సమయాన్ని కేటాయించి చదువు చెప్పాలన్నారు.
అం బేద్కర్ ఆలోచనా విధానాన్ని, వారి ఆశయాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటామన్నారు. ఈనెల 20వ తేదీ తర్వాత ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తామని, గ్రూప్-1, 2, 3, 4లతోపాటు ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల లో, పోలీసు ట్రైనింగ్ సెంటర్లో శిక్షణా తరగతు లు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతోపాటు గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అనంతరం వికారాబాద్ జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకోసం కుల, మతాలకు అతీతంగా కృషి చేయాలన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు చాలా శక్తివంతమైనవని, ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని అన్నారు.
రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దీనికి కార ణం అంబేద్కర్ అని అన్నారు. అనంతరం ఎకరం స్థలంలో బాబూ జగ్జీవన్‌రామ్ భవన నిర్మాణానికి మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, ఎంపీపీ చంద్రకళ, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, జిల్లా వైద్యాధికారి తుకారాం, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ షర్మిల, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజలింగం, అనంతయ్య, దేవదాస్, అం జయ్య, ఆనంద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి
చేవెళ్ల టౌన్, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత అంబేద్కర్‌కే దక్కిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గురువారం చేవెళ్లలోని ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా మన రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పేదలకు సమానత్వం, ఆత్మగౌరవం దక్కాలన్నదే అంబేద్కర్ ఆశయమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎం పీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, సర్పంచ్ శైజలాఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మం డల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మా జీ వైస్ చైర్మన్లు మాణిక్యం, నర్సింహులు, ఉప సర్పంచ్ యాదయ్య, అంబేద్కర్ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా..
మొయినాబాద్, ఏప్రిల్ 14: అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని అజీజ్‌నగర్ పాత గేట్ వద్ద సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత ఆధ్వర్యంలో గురువారం జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంత్యుత్సవంలో మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, శ్రీశైలం, రాజు, మాణిక్యం, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ బేగరి రాజు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిమాయత్‌నగర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని తీశారు.