కడ్తాల్, ఫిబ్రవరి 22: దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషించబోతున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్సీ స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువ కాలం పాలించాయని, కానీ దేశం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందక పోవడానికి కారణం ఆ రెండు పార్టీలేనని విమర్శించారు. పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు అందజేయాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. బీజేపీ పాలనపై దేశ ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. సమావేశంలో కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ప్రసాద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, నాయకులు భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్, చందోజీ, జహంగీర్‌అలీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, కృష్ణ, పాండునాయక్, ప్రభులింగం పాల్గొన్నారు.