ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్/ యాచారం, ఏప్రిల్ 11 : జ్యోతిబాఫూలేను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు అన్నారు. సోమవారం జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ స్రవంతి నివాళి అర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘం నాయకుడు పరమేశ్, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. యాచారంలో టీఆర్ఎస్ నాయకుడు మస్కు రమేశ్ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాల వేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు.
షాద్‌నగర్‌రూరల్ : చించోడ్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం జయమ్మ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. జీవిత చరిత్రను వివరించారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన ఎంతో కృషి చేశాడన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
కొత్తూరు : అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. జయంతి సందర్భంగా కొత్తూరులోని ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బ్యాగరి యాదయ్య, బీసె సెల్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్, మాసులు రామకృష్ణ, భిక్షపతి, శ్రీనుచారి, రవి పాల్గొన్నారు.
మహనీయులను స్మరించుకోవాలి
చేవెళ్లటౌన్ : సమాజ మార్పు కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులను స్మరించుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. చేవెళ్లలోని ఫూలే విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ మధు గుప్తా, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, సీఏసీఎస్ మాజీ డైరెక్టర్ ఆగిరెడ్డి, వార్డు మెంబర్ మల్లారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నారాయణ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే
షాద్‌నగర్‌టౌన్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాఫూలే అని దళిత, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆయన జయంతి సందర్భం గా మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని జ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సం ఘం దక్షిణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్, దళిత, ప్రజా సంఘాల నాయకులు ప్రభాకర్, సిద్దార్థ, రాజు, జంగయ్య, రాములు, నర్సిం హ, రఘునాథ్, నారాయణ, రవి, జనార్దన్, వెంకటయ్య, శ్రీను, శివ, ఈశ్వర్, అనిల్ పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
కడ్తాల్ : మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారని, బాలికలు విద్యను అభ్యసించాలని పాఠశాలలను స్థాపించిన తొలి మహనీయుడు ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, నాయకులు భాస్కర్‌రెడ్డి, హన్మానాయక్, వేణుగోపాల్, చందోజీ, భిక్షపతి, రాంచంద్రయ్య, నరేశ్‌నాయక్, మల్లేశ్‌గౌడ్, మల్లయ్య పాల్గొన్నారు.
షాబాద్ : మండల కేంద్రంలో జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ.. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో రాము, శ్రీశైలం తదితరులున్నారు.
దళిత, బహుజనుల దిక్సూచి..
ఆమనగల్లు : దళిత, బహుజనుల దిక్సూచి ఫూలే అని ఎంపీపీ అనిత, ఎంపీడీవో వెంకట్రాములు అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జ్యోతిబాఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్, ఎంపీవో ఉమారాణి, ఏఈ కృష్ణయ్య, సీనియర్ అసిస్టెంట్ కుమార స్వామి, సర్పంచ్ అంబర్‌సింగ్, నాయకులు శివలింగం, గాజుల శ్రీను పాల్గొన్నారు.
తలకొండపల్లి : వివిధ గ్రామాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే జయంతిని నిర్వహించారు. సమాజంలో అంతరాలను తొలగించేందుకు కృషి చేసిన మహనీయుడు ఫూలే అని సర్పంచ్ కుమార్ అన్నారు. మం డల కేంద్రంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు.
శంకర్పల్లి : మున్సిపల్ పరిధిలోని ఫూలే విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు సత్యనారాయణ, బీర్ల నర్సింహ, మాజీ జడ్పీటీసీ నారాయణ, శంకర్పల్లి మాజీ సర్పంచ్ సాత ఆత్మలిం గం, సింగాపురం మాజీ సర్పంచ్ విఠలయ్య, మాజీ ఎంపీటీసీ కృష్ణ, ఎస్ఐ సంతోష్‌రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో జ్యోతిబాఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, సర్పంచ్ గూడ వెంకటస్వామి, బాబురావు, నాయకులు జబ్బార్, సోమేశ్, పాండు, శ్రీను, అంజయ్య పాల్గొన్నారు.
ఫూలే గొప్ప సంఘ సంస్కర్త
మొయినాబాద్ : జ్యోతిబాఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. బలహీన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని తెలిపారు. మండల కేంద్రంలో మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ బేగరి రాజు ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్ సులోచన, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, ఎంపీటీసీలు రాంరెడ్డి, రితీశ్‌రెడ్డి, నాయకులు జయవంత్, దర్గ రాజు, మాణిక్యం, సురేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుండె రవీందర్ ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఫూలే సేవలన స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్‌గౌడ్, ఎఫ్ఎస్సీఎస్ డైరక్టర్ గుండె సత్యనారాయణ, నాయకులు సతీశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎండీ నసీరుద్దీన్, రాంగోపాల్‌గౌడ్, నాగమల్లు పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని వివిధ గ్రామాల్లో జయంతిని నిర్వహించారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌లు నహీదాబేగం, కొంగరవిష్ణు వర్ధన్‌రెడ్డి, ఎల్లంకి అనిత, శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి, మల్లేశ్, యాట జగన్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకు లు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ యన చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు.