ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 10 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. కల్యాణ మండపాలను పూలమాలలతో అలంకరించారు. కల్యాణ మహోత్సవానికి ముందు స్వామి, అమ్మ వార్ల విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులతో పాటు సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంట్లూరులో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, సీతారాంపేట్, శేరిగూడ, ఖానాపూర్ గ్రామాల్లో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పరిగూడలో సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యం లో మహోత్సవాన్ని నిర్వహించారు. మంచాల మండలం నోముల గ్రామంలో సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ ఆధ్వర్యంలో సీతారాములను రథంపై ఊరేగించి అనంతరం కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించా రు. మంచాల మండలం కాగజ్‌ఘాట్ గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్ పూజలు నిర్వహించారు.
షాబాద్ : షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణం అనంతరం స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. జై శ్రీరామ్…జై జై శ్రీరామ్ అంటూ సీతారాంపూర్ గ్రామం మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. షాబాద్ మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కుమ్మరిగూడ, షాబాద్, మన్మర్రి, బోడంపహాడ్, సర్దార్‌నగర్, హైతాబాద్, తాళ్లపల్లి తదితర గ్రామాల్లోని దేవాలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ సందీప్, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలో..
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులకు ఆలయాలకు పోటెత్తారు. కొందుర్గు మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కొందుర్గు సర్పంచ్ ఆదిలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, గోపాల్, శ్రీధర్‌రెడ్డి, నర్సింహులు, ఎదిర రామకృష్ణ, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
షాద్‌నగర్/ షాద్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 10: శ్రీరామ నవమి వేడుకలు షాద్‌నగర్ పట్టణంలో అంబరాన్నంటాయి. ఆంజనేయస్వామి, హనుమాన్ ఆలయం, శివాలయాలు, సీతారాముల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
సీతారాముల కల్యాణమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పట్టువస్ర్తాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్రావు, కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని శ్రీ శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సింహులు, ప్రతాప్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్యయాదవ్, వివిధ పార్టీల నాయకులు శంకర్, శ్రీవర్ధన్‌రెడ్డి, బార్ అసోయేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. యువజన సం ఘం సభ్యులు, ప్రజలు శ్రీరామనామస్మరణతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
చేవెళ్ల రూరల్ : ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్ కల్యాణం జరిపించారు. ఆలూరు గ్రామంలో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి హాజరై పూజలు నిర్వహించారు. ఈర్లపల్లి గ్రామంలో సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్ కల్యాణం జరిపించారు. అనంతరం ముడిమ్యాల, ఆలూరు తదితర గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, జిల్లా సివిల్ సైప్లె సభ్యుడు రవీందర్, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు తోట శేఖర్, ఆలూరు ఉప సర్పంచ్ వెంకటేశ్ యాదవ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మొయినాబాద్ : సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని వీధుల్లో పల్లకీలో ఊరేగించారు. హనుమాన్ దేవాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని ఎంతో కనుల పం డువగా నిర్వహించారు. సురంగల్, మొయినాబాద్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, పెద్దమంగళారం, హిమాయత్‌నగర్, అమ్డాపూర్, మేడిపల్లి, చిన్నమంగళారం, శ్రీరాంనగర్, బాకారం, నక్కలపల్లి, వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ అజీజ్‌నగర్, రెడ్డిపల్లి , చిన్నషాపూర్ గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
శంకర్పల్లి : మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. మున్సిపల్ పరిధిలోని రైల్వే యార్డులో గల రామాలయ దేవాలయంలో, చిన్న శంకర్‌పల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయం, బుల్కాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో సీతారాముల కల్యాణాలను వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి దంపతులు, కౌన్సిలర్ లక్ష్మమ్మరాంరెడ్డి దంపతులు, జూలకంటి శ్వేతాపాండురంగారెడ్డి దంపతులు జరిపించారు. బుల్కాపురంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్ దంపతులు పూజలు నిర్వహించారు.
హయత్‌నగర్ రూరల్ : రామ నామంతో ఊరూవాడా మార్మోగింది. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, ఎదుర్కోళ్లు, బ్యాండ్ బాజా మధ్య సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో కౌన్సిలర్ దేవిడి గీతారెడ్డి, మర్రిపల్లిలో కౌన్సిలర్ పాశం అర్చన, కుత్బుల్లాపూర్‌లో సర్పంచ్ ముద్దం స్వరూపా వీరస్వామి, గౌరెల్లిలో సర్పంచ్ తుడుం మల్లేశ్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, పర్షావత్, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, సుక్క భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. తట్టిఅన్నారంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
పెద్దఅంబర్‌పేట : సీతారాముల కల్యాణం మున్సిపాలిటీలోని అన్ని వార్డులో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, మురళీధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాజేందర్, విద్యావతి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్ బండారి శైలజ పాల్గొన్నారు.
కేశంపేట : కేశంపేట, ఎక్లాస్‌ఖాన్‌పేట, కొత్తపేట, తొమ్మిదిరేకుల, లింగంధనలలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, భక్తులు ఘనంగా జరిపించారు. ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఎంపీపీ రవీందర్‌యాదవ్-కవిత దంపతుల చేతుల మీదుగా కల్యాణం జరిగింది. కార్యక్రమాల్లో జడ్పీటీసీ విశాల, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, సావిత్రి, నాగిళ్ల ప్రతాప్, ఎంపీటీసీ మల్లేశ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్ పాల్గొన్నారు.
ఆమనగలు : ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లోని పలు ఆలయాల్లో రాములోరి కల్యాణం కనుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. రెండో భద్రాది గా పేరుగాంచిన చారకొండ మండలంలోని సిర్సనగండ్ల రాములోరి ఆలయంలో నిర్వహించే కల్యాణం తిలకించేందుకు ఆమనగల్లు బ్లాక్ మండలాల నుంచి పలువురు భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర
షాద్‌నగర్‌టౌన్ : హిందూ వాహిని ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీరాముడి శోభాయాత్రను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రారంభించారు. వందలాదిగా యువకులు షాద్‌నగర్ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ఫరూఖ్‌నగర్ వరకు నిర్వహించిన శ్రీరాముడి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్‌కుమార్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండల వ్యాప్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు పట్టు వస్ర్తాలను సమర్పించారు.సాయంత్రం శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించారు.
యాచారం : పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. శ్రీరామచంద్రుడు, సీతాదేవిలను పట్టువస్ర్తాలతో అందంగా ముస్తాబు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో రాములోరి కల్యాణం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లవెల్లిలో స్వామివారికి రూ.1,16000లను భక్తులు కట్నాల రూపంలో, బంగారు పుస్తె, వెండి మెట్టెలను కానుకలుగా సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీధర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజు, సంతోష, ఉదయశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : శ్రీరామనవమి సందర్భంగా మండలంలో సీతారాముల కల్యాణం ఎంతో అంగరంగ వైభగంగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దాతలు, భక్తుల సహకారంతో తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తీగాపూర్, శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.