రంగారెడ్డి, మార్చి 31, (నమస్తే తెలంగాణ): 58, 59 జీవోల కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకాగా ఇప్పటివరకు 31,830 దరఖాస్తులు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు అందాయి. అయితే చివరిరోజు క్రమబద్ధీకరణ కోసం 4,173 దరఖాస్తులు రావడం గమనా ర్హం. జిల్లాలోని అర్బన్ ప్రాంతం నుంచే అత్యధికంగా దరఖాస్తులొచ్చాయి. జిల్లాలోని 27 మం డలాల నుంచి 31,830 దరఖాస్తులురాగా, అం దులో అత్యధికంగా శేరిలింగంపల్లి మండలం నుంచి 9,854 దరఖాస్తులు, అబ్దుల్లాపూర్మెట్ మండలం నుంచి 5,990, బాలాపూర్ మండ లం నుంచి 4,494, సరూర్నగర్ మండలం నుంచి 3,669 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా 2014 జూన్ 2కు ముందు ఇండ్లు నిర్మించుకున్న వాటిని క్రమబద్ధీకరించేందుకు కటాప్ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 59 కింద 50 శాతం మేర ఇండ్లు నిర్మించి ఉండటంతోపాటు జీవో 58 కింద దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డుతోపాటు రిజిస్టర్డ్ డాక్యుమెం ట్, ఆస్తి పన్ను చలాన్లు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను జతపర్చాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 58, 59 జీవోల కింద ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలో ఉన్న వారి దరఖాస్తులను స్వీకరించి, 125 గజాల్లోపు ఉన్న స్థలాలను ఉచితంగానే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 125 గజాలకుపైన ఉన్న స్థలాలకు సం బంధించి మార్కెట్ ధర ప్రకారం క్రమబద్ధీకరించారు. కాగా మరిన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో పేదల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ మరోసారి ఈ అవకాశం ఇచ్చారు.
చివరి రోజు దండిగా దరఖాస్తులు
58, 59 జీవోల కింద చివరి రోజు అధిక సం ఖ్యలో దరఖాస్తులొచ్చాయి. గురువారం ఒక్కరోజే 4,173 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా రెవె న్యూ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి మండలం నుంచి 1,439 దరఖాస్తులు, అబ్దుల్లాపూర్మెట్ నుంచి 658, బాలాపూర్ నుంచి 509, సరూర్నగర్ మండలం నుంచి 463 దరఖాస్తులు వచ్చాయి. అయితే గురువారం అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు సమ యం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, నందిగామ, షాబాద్, కొందుర్గు మండలాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
90 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు
ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్న వారివి క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన 58, 59 జీవోల కింద దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. కాగా వచ్చిన దరఖాస్తులను 90 రోజుల్లోగా పరిష్కరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రా రంభించనున్నారు. అంతేకాకుండా అన్ని మండలాల్లోని ప్రభుత్వ, అసైన్డ్, కోర్టు కేసులు, భూదా న్ తదితర భూముల వివరాలను గ్రామాలవారీగా సేకరించారు. దరఖాస్తుల వారీగా ఆయా మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చలాన్లు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను పరిశీలించనున్నారు.
వికారాబాద్ జిల్లా నుంచి 151 దరఖాస్తులు
ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్న వారివి క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన 58, 59 జీవోల కింద దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. వికారాబాద్ జిల్లా నుంచి క్రమబద్ధీకరణకు 151 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 29వ తేదీ వరకు మో మిన్పేట్ మండలం నుంచి 132 దరఖాస్తులు రాగా, వికారాబాద్ నుంచి 11, తాండూరు నుంచి 3, ధారూర్ నుంచి 2, నవాబుపేట నుంచి 2, పరిగి మండలం నుంచి ఒకటి
చొప్పున దరఖాస్తులొచ్చాయి. 125 గజాలకుపైన ఉన్న స్థలాలకు సంబంధించి మార్కెట్ ధర ప్రకారం క్రమబద్ధీకరించారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం తో జిల్లా నుంచి తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు రెవెన్యూ అధికారులకు అందాయి.