ప్రజల కోసమే ప్రగతి నివేదన యాత్ర
ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రగతి నివేదన యాత్ర చేపట్టినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.
యాచారం, జనవరి28: ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రగతి నివేదన యాత్ర చేపట్టినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం గ్రామాల్లో శనివారం ప్రగతి నివేదన యాత్ర విజయవంతంగా కొనసాగింది. మొండిగౌరెల్లి గ్రామంలో భూగర్భ డ్రైనేజీకి రూ.5 లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేయించి సమస్య పరిష్కరిస్తానన్నారు. గ్రామంలో వివిధ పార్టీల నుంచి 10మంది నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గ్రామీణ క్రీడాకారులకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. ఎట్టి జంగయ్య అనే దివ్యాంగుడికి ట్రై సైకిల్‌ను ఉచితంగా అందజేశారు. గ్రామంలో ప్రభుత్వ సహకారంతో 62మందికి కేసీఆర్ కిట్లను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
గ్రామాభివృద్ధికి ఎనిమిదేళ్ల పాలనలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవతో రూ.8.43కోట్లతో ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలో అసైన్డ్ భూమి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం యాచారంలో యాత్రను కొనసాగించారు. వాడవాడన తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగర్ రహదారిపై రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మెల్యే కృషితోనే యాచారంలో నాలుగు లైన్ల సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ బండిమీది కృష్ణ, కొత్తపల్లి ఎంపీటీసీ సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య, డైరెక్టర్లు శశికళ, స్వరూప, నాయకులు లక్ష్మయ్య, యాదయ్య, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

