రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు చేవెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపిక
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సాత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.
మొయినాబాద్, డిసెంబర్ 17 : జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సాత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల నుంచి పర్యావరణ శబ్ధ కాలుష్య రహిత రోడ్డు రవాణా, నిత్యజీవితంలో రేఖాగణిత ప్రాముఖ్యత, మాన్సూన్ హెల్మెట్ అనే నమూనాలను ప్రదర్శించారు. హెల్మెట్ అన్ని కాలాల్లో ధరించేలా సాత్విక రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్‌కు హెల్మెట్ ప్రయోజనాలను సమగ్రంగా వివరించింది. దీంతో వారు సాత్వికను, నమూనాను తయారుచేయడానికి సంపూర్ణ సహకారమందించిన ఫిజికల్ సైన్స్ టీచర్, మెంటర్ అనితను అభినందించారు. సాత్వికకు మంత్రి సబితారెడ్డి రూ.3000, ప్రశంసాపత్రం, షీల్డ్‌ను బహూకరించారు. హైదరాబాద్-రంగారెడ్డి పశ్చిమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారద స్వాతికతోపాటు విద్యార్థినిని ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, మెంటర్ అనితను అభినందించారు. పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

