షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 17: షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నూతన సీసీరోడ్లు, అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణం మరింత సుందరంగా మారిందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేను కౌన్సిలర్లు, నాయకులు సన్మానించారు. 1వ వార్డులో రూ. 22లక్షలతో సీసీ రోడ్డు, 12వ వార్డులో రూ. 6 లక్షలతో అంతర్గత మురుగుకాలువ, 13వ వార్డులో రూ.3 లక్షలతో సీసీరోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఉన్నత లక్ష్యంతో చదవాలి
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని ఠాగూర్ పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో చదువుకోవాలన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు అంతయ్య, గౌస్, చంద్రకళ, కో ఆప్షన్ సభ్యుడు గౌస్జానీ, నాయకులు జూపల్లి శంకర్, చెట్ల నర్సింహులు, శ్రీనివాస్, అశోక్, నవీన్, రాజశేఖర్, శ్రీకాంత్, నవీన్, వెంకటే పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
నందిగామ : అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలను శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మండలంలోని నర్సప్పగూడ అక్కమ్మ చెరువులో సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నందిగామ హైవే రోడ్డు నుంచి నర్సప్పగూడ గ్రామం వరకు రూ.3.10 కోట్లతో రీ బీటీ రోడ్డు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు మంజూరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, నర్సప్పగూడ సర్పంచ్ గోవిందు అశోక్, ఎంపీటీసీ కళమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు, నాయకులు యాదగిరిగౌడ్, భూపాల్, కృష్ణ, రవీందర్, చందన్, యాదగిరి, సిద్దు, రవి తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్
కేశంపేట : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వట్టెల పెంటయ్యకు రూ. 4 లక్షల ఎల్వోసీ ప్రొసీడింగ్‌ను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌కుమార్, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, ఉపసర్పంచ్ నరేశ్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, యాదయ్యగౌడ్, గణేశ్‌గౌడ్, దశరథం పాల్గొన్నారు.