ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అభివృద్ధిలో కడ్తాల్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు.
కడ్తాల్, డిసెంబర్ 13 : అభివృద్ధిలో కడ్తాల్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీటీసీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రావిచేడ్ గ్రామం నుంచి మద్దెలకుంట వరకు చేపట్టిన బీటీ రోడ్డుతోపాటు మద్దెలకుంట తండాలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. నూతన మండలం కడ్తాల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రావిచేడ్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ రూ.25 లక్షలు మంజూరు చేశారన్నారు. అనంతరం పల్లెచెల్క తండాలో ఇటీవల మరణించిన వివిధ కుటుంబాలను పరామర్శించి ఐదు వేల చొప్పున రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్‌లు సులోచన, తులసీరాంనాయక్, లోకేశ్‌నాయక్, భారతమ్మ, యాదయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, ఉప సర్పంచ్‌లు వెంకటేశ్, గణేశ్, సీతారాం పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

