ధరలు తగ్గుతాయని వేచి చూడొద్దు!
‘రేటు ఆగదు... డిమాండ్ తగ్గదు’ అనే సరికొత్త థీమ్తో ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026’ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు ఎన్ జైదీప్ రెడ్డి తెలిపారు.
- హైదరాబాద్ క్రెడాయ్ ప్రతినిధులు వెల్లడి
- ఆగస్టు 28 నుంచి హైదరాబాద్ ప్రాపర్టీ షో
సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ‘రేటు ఆగదు… డిమాండ్ తగ్గదు’ అనే సరికొత్త థీమ్తో ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026’ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు ఎన్ జైదీప్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో క్రమంగా పెరుగుతున్న మౌలిక వసతులు, ఐటీ రంగ విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగులేకుండా పోయిందని, రాబోయే రోజుల్లో ప్రాపర్టీ ధరలు మరింత పెరిగే అవకాశమే తప్ప తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
ఆగస్టు 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్టు గురువారం వెల్లడించారు. ఈ ప్రాపర్టీ షోలో 100కు పైగా రెరా ఆమోదిత ప్రాజెక్టులను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ఒకే వేదికపై ప్లాట్లు, విల్లాలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జగన్నాథ్ రావు అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

