కడ్తాల్, నవంబర్ 30 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం కడ్తాల్‌లోని ఏంబీఏ గార్డెన్స్‌లో తహసీల్దార్ మురళీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 52 మంది లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. నియోజకవర్గంలో ఆరు వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, ఖాళీ స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. కడ్తాల్‌లో అన్ని శాఖలకు భవనాలను నిర్మిస్తామని, త్వరలో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన, షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో స్థానికులకే కేటాయించాలని చిరు వ్యాపారస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, సులోచన, యాదయ్య, లోకేశ్, సుగుణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, ముత్యాలు, నర్సింహ, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, నర్సింహగౌడ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్‌యాదవ్, యూత్ వింగ్ అధ్యక్షుడు ఇర్షాద్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు సాయిలు, చంద్రమౌళి, గోపాల్, జంగయ్య, నాగార్జున ఉన్నారు.
రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
మాడ్గుల : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మాడ్గులలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థను లేకుండా చేసి, రైతులను మోసపోకుండా ప్రభుత్వం కాపాడుతున్నదన్నారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసిన 15 రోజుల్లోపే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. గ్రేడ్ ఎ రకానికి రూ.2060 క్వింటాల్‌కు, గ్రేడ్ బి రకానికి రూ.2040 నిర్ణయించడం జరిగిందన్నారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నిఘంటువులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనువాస్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాడ్గుల చైర్మన్ తిరుమల్‌రెడ్డి, సర్పంచ్ జంగయ్యగౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రవి, ఉప సర్పంచ్ రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.