షాద్‌నగర్, నవంబర్ 15: వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే భార్య పినకుంట అనిత, ప్రియుడు రామస్వా మి కలిసి ఫరూఖ్‌నగర్ మం డలం చిల్కమర్రి గ్రా మానికి చెందిన రవితేజను హత్య చేశారు. షాద్‌నగర్ పట్టణ సీఐ నవీన్‌కుమార్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో రవితేజ హత్య కేసు వివరాల ను వెల్లడించారు. నవాబుపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామి కొన్నేండ్లుగా అనితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తమ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న రవితేజను ఎలాగై న చంపాలని ఇరువురు కలిసి ప్రణాళిక వేశారు. అందులో భాగంగానే ఈ నెల 7వ తేదీన ప్రియుడు రామస్వామితో కలిసి గ్రామ సమీపంలోని ఓ వెంచర్లో రవితేజకు పురుగుల మందు కలిపిన మద్యాన్ని తాగించారు. రవితేజ అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఏమీ తెలియనట్లు రవితేజను షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ రవితేజ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రవితేజ మృతికి కారణమైన అనిత, రామస్వామిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.