పరిగి టౌన్, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనుబంధ గ్రామాలను గ్రామ పం చాయతీలుగా గుర్తించడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నాటి అనుబంధ గ్రా మా లు నేడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తున్నాయి. పరిగి మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామం గతంలో కాళ్లాపూర్ గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామంగా ఉండేది. గతంలో సరైన మురుగు కాల్వలు, రోడ్లు, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకొని సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సిమెంట్ రోడ్లు మురుగు కాల్వల నిర్మాణాలను చేపట్టారు.
సహకార బ్యాంకు నిధులతో రైతులు పం డించిన పంటలను కొనుగోలు చేసేందుకు కోటి రూపాయలతో కొనుగోలు కేంద్రాన్ని నిర్మించారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్త య్యాయి. గ్రామ స్టేజి నుంచి ఊర్లోకి వెళ్లేందుకు విశాలమైన సిమెంటు రోడ్డు వేయడంతో పాటు మురుగు కాల్వలు నిర్మించారు. పల్లెప్రకృతి వనాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. గ్రామ స్టేజి నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల పక్కన హరితహారంలో భాగంగా మొక్క లు నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రంగు రంగుల పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటారు. గ్రామంలో గతంలో చేపట్టని అభివృద్ది పనులను ప్రస్తుతం చేపడుతుండటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలకతీతంగా..
స్థానిక ఎమ్మెల్యే కొ ప్పు ల మహేశ్‌రెడ్డి స హ కారంతో పార్టీల కతీ తంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేయడమే తన ధ్యేయం. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనే జీ నిర్మా ణంతో పాటు గ్రామ పంచాయతీ భవనం వరకు ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ పనులు చేప డుతాం. ఉత్తమ గ్రామ పంచాయతీగా గు ర్తింపు తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తా. – నల్క జగన్, గ్రామ సర్పంచ్