వికారాబాద్, నవంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో చిక్కులు లేని ఖాళీ స్థలాలను సొంతం చేసుకోవడానికి బహిరంగ వేలం పాట నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వికారాబాద్ మండలంలోని గంగారంలో గల ఆహ్లాదకర పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చిక్కులు లేని ఖాళీ స్థలాలను సొంతం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వికారాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. వికారాబాద్ నుంచి ద్యాచారం వెళ్లే దారిలో గంగారంలో ఖాళీగా 3.5 ఎకరాల స్థలం ఉంది.
ప్రధాన రహదారికి 475 మీటర్లు., స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి 3.2 కిలోమీటర్లు., ఎస్ఏపీ కళాశాల నుంచి 1.1 కిలోమీటర్ల దూరంలో కోర్టు కాంప్లెక్స్ పక్కన వికారాబాద్ పట్టణానికి చాలా దగ్గరగా ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. స్థలాలకు సంబంధించి భౌతిక వేలం కోసం ప్రీ బిడ్డింగ్ సమావేశం ఈ నెల 11న స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వేలం పాటలో పాల్గొనడానికి రూ.10వేలు డీడీ రూపకంలో జిల్లా కలెక్టర్ వికారాబాద్ పేరున ఈ నెల 13 వరకు అందజేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 16 మంది అందజేశారు. ఎకరానికి కనిష్టంగా రూ.55లక్షలుగా నిర్ధారించారు. ఈ విషయంలో సందేహాలున్న వారు 7993455775, 9908143341, 9000547566లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించి https://vikarabad.telangana. gov.in జిల్లా వెబ్ సైట్లో పూర్తి సమాచారం పొందుపర్చారు.
ఆలంపల్లి రెవెన్యూ పరిధిలో 15 ఎకరాలు వేలం వాయిదా
– కలెక్టర్ నిఖిల, వికారాబాద్
సోమవారం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించ తలపెట్టిన రాజీవ్ స్వగృహ ఆలంపల్లిలో గల 15 ఎకరాల స్థలం వేలం పాటను తాత్కాలికంగా రద్దయింది. ఆ స్థలంలో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టవలసి ఉన్నందున ఈ వేలం పాటను తాత్కాలికంగా రద్దు చేశాం. గంగారంలో గల 3.5 ఎకరాల స్థలానికి ప్రత్యక్ష వేలం యథావిధిగా ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. వేలం పాటలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చిక్కులు లేని స్థలాలను సొంతం చేసుకోవాలి.