ఆమనగల్లు, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలులో తెలంగాణపై వివక్ష చూపుతూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, సింగల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌తో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్, పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాల్లో వరికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుకుని వరి ధాన్యానికి క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2060 బీ గ్రేడ్ కు రూ. 2040 మద్ధతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆమనగల్లు మున్సిపాలిటీ సంఘం అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేయించానని, ఈ నిధులతో సీసీ రోడ్లు, భూగర్భ మురుగు కాల్వలు, పార్కులు, జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ లో రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో 58 దుకాణాలు నిర్మిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయం ఎదుట, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని అనుసరించి షాద్‌నగర్ జాతీయ రహదారిని పక్కన, బస్టాండ్ పక్కన జిల్లా పరిషత్ పాఠశాలకు రెండు వైపులా 300 దుకాణాలు నిర్మిస్తామన్నారు. పట్టణంలో గాంధీ చౌక్ నుంచి షాద్‌నగర్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆమనగల్లు పీహెచ్‌సీని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అప్‌గ్రేడ్ చేసి ప్రజలకు 24 గంటల వైద్య సేవలను అందిస్తామన్నారు. ఆమనగల్లు సురసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా నిర్మాణం చేయడానికి గతంలో రూ.5.89 కోట్లు మంజూరు చేయించామని, ఇటీవల మరో 2.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, రైసస మండల అధ్యక్షుడు నిట్టనారాయణ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, ఎంపీటీసీ కుమార్, ఏఎంసీ డైరెక్టర్స్ సుభాష్, రమేశ్, కాసుల కృష్ణయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు రామకృష్ణ, అప్పం శ్రీనివాస్, ఖలీల్, గుత్తి బాలస్వామి, జంతుక అల్లాజీ, ఆంజనేయులు, యువజన నాయకులు జంతుక కిరణ్, రమేశ్, భాస్కర్, శివ, మార్కెట్ సూపర్వైజర్ శ్రీశైలం పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి
ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామంలోని మైసమ్మతల్లి జాతర ఘనంగా కొనసాగుతున్నది. శనివారం ఐదో రోజు ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఆలయ ఈవో స్నేహలత, చైర్మన్ శిరోలీపంతూనాయక్, ఆలయ నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ తులసీరాంనాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, అనంతరెడ్డి, అర్జున్‌రావు, నారాయణ, ఆలయ అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, బోడియనాయక్, కృష్ణ, రాములు, చంద్రయ్య, దేవేందర్, వెంకటేశ్, శ్రీనివాస్, రమాదేవి, విజయ్, మహేశ్, రామకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని కొల్కులపల్లి గ్రామానికి చెందిన పుప్పాల వెంకటయ్యకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 30,000, చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కొల్కులపల్లి అధ్యక్షుడు భూపతిరెడ్డ్డి, మున్నారెడ్డి ఉన్నారు.