పూడూరు, నవంబర్ 10: సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆశ స్వచ్ఛంద సంస్థ (సైబేజ్ ఆశ) పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేదోడు వా దోడుగా నిలుస్తున్నది. ఇప్పటివరకు ఈ సంస్థ సభ్యు లు మండలంలోని సిరిగాయపల్లి, సోమన్గుర్తి గ్రామాలను దత్తత తీసుకుని పలు అభివృద్ధి పనులను చేపట్టారు. 2019లో సిరిగాయపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సంస్థ సభ్యులు మూడేండ్ల కాలంలో దాదాపుగా రూ.33 లక్షలతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. గ్రామాభివృద్ధితోపాటు రైతులను సంఘటితం చేస్తూ వారికి కావాల్సిన వ్యవసాయ పనిముట్లను అందజేస్తూ పంటల అధిక దిగుబడికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యశిబిరం నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడంతోపాటు వృద్ధులకు కంటి అద్దాలను కూడా అందజేశారు. ప్రభుత్వ నిధులతోపాటు సంస్థ నుంచి నిధులను వెచ్చించి గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు, అంగన్వాడీ, పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. రైతు సంఘంలో ఉన్న 60 మంది రైతులకు ఆర్థిక భా రం తగ్గించేందుకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేశారు. పంటల సాగులో రైతులు కూలీల కొరతతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంఘంలోని సభ్యులకు పొలంలో కలుపు తొలగించే ఆరు యంత్రాలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేతులమీదుగా అందజేశారు. అంతేకాకుండా గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద ఉమ్మెంతాల్ హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.
అదేవిధంగా మండలంలోని సోమన్గుర్తి గ్రామ పంచాయతీలోనూ సైబేజ్ ఆశ సంస్థ సభ్యులు దాదాపుగా ఎనిమి ది లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టారు. ఊరిలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం కోసం ఇటీవల రూ. ఐదు లక్షలను అందజేయడం తోపాటు హైస్కూల్లో విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, బ్లాక్‌బోర్డు, మంచి నీటి సౌకర్యం వంటి పలు మౌలిక వసతులను కల్పించారు. సంస్థ ద్వారా వెనుకబడిన గ్రామాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపా రు. గ్రామా ల్లో చేస్తున్న అభివృద్ధి పనులకు ఇరుగ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 33 లక్షలతో అభివృద్ధి పనులు
సైబేజ్ ఆశ సంస్థ సభ్యులు మా గ్రామంలో గత మూడేండ్ల కాలంలో దాదాపుగా రూ.33 లక్షల తో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీరోడ్లు, అంగన్వాడీ, పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సం ఘంలో ఉన్న రైతులకు ఉచితంగా వ్యవసాయ యంత్రాలు, ఎరువులను అందించడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. మా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సైబేజ్ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు.
-సీతారాంరెడ్డి, సిరిగాయపల్లి గ్రామస్తుడు
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు
సైబేజ్ ఆశ సంస్థ సభ్యులు మా గ్రా మంలోని పాఠశాలలో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఇటీవల ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం కోసం ఇటీవల రూ.ఐదు లక్షలను అందజేశారు. విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా బెంచీలతో తాగునీటి వసతిని సమకూర్చారు. మా గ్రా మాన్ని ఎంపిక చేసుకుని పాఠశాల అభివృద్ధికి కృ షి చేస్తున్న సైబే జ్ ఆశ సంస్థ వారికి రుణపడి ఉంటాం.