యాలాల, నవంబర్ 10 : జిల్లాలో నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ శేఖర్‌గౌడ్‌తో కలిసి సందర్శించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎస్పీ కోటిరెడ్డి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీకి వార్షిక నివేదికను పట్టణ సీఐ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు వ్యవస్థ పనితీరు, అవలంబిస్తున్న విధానాలు, తీసుకోవలసిన చర్యలపై పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. పోలీసు స్టేసన్‌కు పిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు, పిల్లలు, వృద్దులతో మర్యాదగా మాట్లాడలన్నారు. వారి విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అన్ని సమయాల్లో ప్రజల నుంచి వచ్చే పిర్యాదులు పోలీసులు స్వీకరించాలన్నారు. స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మహిపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు మంచి పేరు తీసుకరావాలి
బషీరాబాద్ : ఎస్పీ కోటిరెడ్డి గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కేసుల ఛేదనలో సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న టెన్నిస్కోర్టును ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, సీఐ రాంబాబు, ఎస్సైలు విద్యాచరణ్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఉన్నారు.