నందిగామ, నవంబర్ 7 : గ్రామాల అభివృద్ధ్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ జిల్లెల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.25 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లని భావించి సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ మెక్కోండ కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వర్, నవీన్‌రెడ్డి, తుప్పుడు కృష్ణ పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే మునుగోడులో గెలుపు
కొత్తూరు : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అపూర్వ విజయం సాధించడంతో కొత్తూరు మున్సిపాలిటీకి చెందని టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను సోమవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బీజేపీ వాళ్ల ఆరోపణలు తిప్పకొట్టి తాను ఇన్చార్జిగా ఉన్న ఖుదాబక్షిపల్లి, వెంకీపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చేలా కృషి చేశామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, మావిళ్ల విఠల్, కేకే కృష్ణ, మధుసూదన్‌రావు, నాగరాజు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు
షాద్‌నగర్‌టౌన్ : అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఆదివారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవాలలో ముషీరాబాద్ హరిబాబు దున్నలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదిక వద్ద ఎమ్మెల్యేలు వై. అంజయ్యయాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, అభిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌యాదవ్, నాయకులు దేవేందర్‌యాదవ్, రవియాదవ్ దున్నపోతులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు రాజ్యలక్ష్మి, రాము లు, ప్రవీణ్, వెంకట్‌నర్సయ్య, వెంకటేశ్, రాంచందర్, జగదీశ్, లక్ష్మీపతి, రమేశ్, బాలరాజు, రవీందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఖుదాబక్షిపల్లి, వెంకీపల్లి గ్రామాల ఇన్చార్జిగా వ్యవహరించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ను ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సోమవారం సన్మానించారు. టీఆర్ఎస్ 540 ఓట్లకు పైగా లీడ్ వచ్చిందని తెలిపారు.