శంకర్పల్లి, నవంబర్ 5 : శంకర్పల్లి మండలం గోపులారం గ్రామంలో అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని కేంద్ర సామాజిక న్యాయబృందం సభ్యులు దీపక్షా, ఆనంద్, పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ రామారావు పేర్కొన్నారు. శనివారం గోపులారంలో కేంద్ర బృందం పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. గ్రామంలో ఎటుచూసినా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయని తెలిపారు. పీజేవైఎం ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు మంజూరు చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ కేంద్ర బృందానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, ఎంపీవో గీత, వార్డు సభ్యులు రమేశ్, సురేందర్, వెంకట్‌రెడ్డి, శివలీల పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై అభినందన
మొయినాబాద్, నవంబర్ 5 : ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం నుంచి మండలంలోని నాగిరెడ్డిగూడ, మోత్కుపల్లి గ్రామాలకు 2020లో నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడానికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు దీపక్ష, ఆనంద్ శనివారం ఆ రెండు గ్రామాలను సందర్శించారు. నాగిరెడ్డిగూడలో రూ.20లక్షలతో 14 సీసీ రోడ్లు పనులు చేపట్టగా.. మోత్కుపల్లిలో రూ.20లక్షలతో సీసీ రోడ్లతో పాటు అంతర్గత మురుగు కాలువ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టడంతో నాగిరెడ్డిగూడ ఇన్చార్జి సర్పంచ్ సురేందర్‌గౌడ్, మోత్కుపల్లి సర్పంచ్ రత్నంను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ గోపాల్, పంచాయతీ కార్యదర్శి స్వప్న ఉన్నారు.