నందిగామ, నవంబర్ 5 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపకంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్‌లు నర్సింహులు, అశోక్, రాజు, చంద్రారెడ్డి, రమేశ్‌గౌడ్, రాములమ్మ, ఎంపీటీసీ కట్న లత, ఉపసర్పంచ్లు కుమార్‌గౌడ్, శేఖర్, తహసీల్దార్ అబ్దుల్ రహేమన్, డీటీ అనంద్ సింగ్, నాయకులు వీరేందర్‌గౌడ్, గోవు రవి, శ్రీశైలం, పెంటయ్యగౌడ్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, నర్సింహులు, రమేశ్ పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రభుత్వం
కేశంపేట : పేదలకు కల్యాణలక్ష్మి ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పలు గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలెపోగు రమేశ్‌కు దళితబంధు కింద వచ్చిన కారును అందజేశారు. కొత్తపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన రైతు పల్లాటి కొండయ్య భార్య భారతమ్మకు 5 లక్షల రైతుభీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, తాసిల్దార్ ఆజం అలీ, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి పాల్గొన్నారు.
దైవన్మామస్మరణతోనే మనిషికి ముక్తి
దైవన్మామస్మరణతోనే మనిషికి ముక్తి లభిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో నాలుగు నెలలుగా నిర్వహించిన చాతుర్మాస్య యజ్ఞం ముగింపు కార్యక్రమాల్లో శనివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతొ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల పాల్గొన్నారు.