నవాబుపేట, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వా త మండలంలోని గ్రామం అభివృద్ధిలో ముందు కు దూసుకెళ్తున్నది. గ్రామాభివృద్ధికి సర్పంచ్, అధికారులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామంలో ఎనిమిది వార్డులుండగా.. జనాభా 669 ఉం డగా.. పురుషులు 344, స్త్రీలు 325 మంది ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభు త్వం ప్రతినెలా కేటాయిస్తున్న నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులను సర్పంచ్ చేపడుతున్నారు. అన్ని వార్డుల్లోనూ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, పల్లెప్రకృతివనం, ట్రాక్టర్, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్స రీ, రైతువేదిక భవనం వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టా రు. గ్రామ పరిశుభ్రత కోసం ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామాన్ని పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుతున్నారు. ఇంటింటి నుంచి సేకరించిన చెత్త ను ట్రాక్టర్ సహాయంతో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ ఈ చెత్తాచెదారంతో ఎరువును తయారు చేసి హరితహారం మొక్కలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మి షన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ ప్రతిరోజూ నల్లాల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందుతుండటంతో స్థానికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలు, పాఠశాల వద్ద కూర్చునేందుకు వీలుగా గ్రామ సర్పంచ్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ గ్రామ వాతావరణం చూడముచ్చటగా, అందంగా కనిపిస్తున్నది.
పల్లెప్రగతితోనే మార్పు..
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు ఎంతో మారిపోయాయి. గతంలో అధ్వానంగా ఉండేవి. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సర్పంచ్ సక్రమంగా గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఎమ్మె ల్యే గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.
బుచ్చయ్య, గ్రామస్తుడు
ఆదర్శ గ్రామంగా మారుస్తా
జిల్లాలోనే యావపూర్ను ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లు, బావులను పూడ్చి గ్రామాన్ని సుందరంగా మార్చడం జరిగింది. గ్రామాన్ని పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శుభ్రం గా ఉంచుతున్నారు.
-కిష్టయ్య, సర్పంచ్
అందుబాటులోకి క్రీడాప్రాంగణం
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో గ్రామం అభివృద్ధిలో వెనుకబడిం ది. కానీ.. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో వైకుంఠధా మం, డంపింగ్‌యార్డు, ట్రాక్టర్, పల్లెప్రకృతివనం వంటి పలు అభివృ ద్ధి కార్యక్రమాలను చేపట్టారు. క్రీడాప్రాంగణం అందుబాటులోకి రావడంతో యువత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో క్రీడల్లో సాధన చేస్తున్నారు.
– శ్రీను, గ్రామ యువకుడు