కడ్తాల్, అక్టోబర్ 28: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన కావాటి చంద్రయ్యకు రూ.58వేలు, కొంక వెంకటమ్మకు రూ.28వేలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో మందికి ఆర్థిక సహకారాన్ని అందించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఉప సర్పంచ్ వినోద్‌గౌడ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్‌యాదవ్, గ్రామాధ్యక్షుడు రాజు, నాయకులు గోపాల్, రవి పాల్గొన్నారు.