చేవెళ్లటౌన్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని చేవెళ్ల సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం శ్రేయస్సు కోసం, దేశ రక్షణ, బావితరాల భవిష్యత్ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్ర కీలకమైందని చెప్పారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణంలో పోలీసులు అక్కడకు చేరుకుని సమస్యలను పరిష్కరిస్త్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎస్సైలు అబ్దుల్ హయూం, ప్రదీపు కుమార్, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఆమనగల్లు, అక్టోబర్ 21: సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, సీఐ జాల ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న హన్మంత్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ సుందరయ్య, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నేనావత్ పత్యనాయక్, ఎంపీటీసీ కుమార్, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నిట్ట నారాయణ, నాయకులు నిరంజన్‌గౌడ్, రమేశ్ నాయక్, సాయిలు, అల్లాజీ, సయ్యద్‌ఖలీల్, బాలస్వామి, వెంకటేశ్, భాస్కర్, శివ, రమేశ్, ప్రసాద్, విక్రమ్ పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 27న సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఐ జాల ఉపేందర్ తెలిపారు. ఆమనగల్లు సర్కిల్కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో చెస్, క్విజ్ పోటీలు నిర్వహిస్తామని, పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.3 వేలు, షీల్డ్, రెండో బహుమతి రూ.2 వేలు, షీల్డ్, మూడో బహుమతి రూ.వెయ్యి, షీల్డ్ అందజేయనున్నారు.
కొత్తూరు, అక్టోబర్ 21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కొత్తూరు ఇన్స్పెక్టర్ బాలరాజు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలరాజు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమాజ రక్షణే ధ్యేయంగా పోలీసులు ప్రాణాలను సహితం పణంగా పెట్టి పనిచేస్తున్నారని వివరించారు. కార్యక్రమలో ఎస్ఐలు శంకర్, సయ్యద్, ఏఎస్ఐలు అబ్దుల్లా, విష్ణువర్ధన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
నందిగామ, అక్టోబర్ 21 : శాంతి భద్రత పరిరక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు పని చేస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని నందిగామ సీఐ రామయ్య తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శుక్రవారం నందిగామ సీఐ రామయ్య ఆధ్వర్యంలో పోలీసు అమరవీరులకు నివాళుర్పించారు. కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్, యువసత్తా అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, నాయకులు అశోక్, ఈశ్వర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కేశంపేట, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసు అమరులకు ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.