సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు తీసు కుంటున్నది. హెచ్ఎండీఏ పరిధిలో భవిష్యత్తు శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా గుర్తించిన సంగారెడ్డి, చేవెళ్ల, షాద్‌నగర్, చౌటుప్పల్, గజ్వేల్, భువనగిరి వంటి పట్టణా ల్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధి పను లు చేపడుతున్నది. అందులో భాగంగానే ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న చేవెళ్ల పట్టణంలోని బస్టాండ్‌ను అత్యద్భుతంగా తీర్చిద్దేదిందుకు ప్రతిపాదనలను రూ పొందిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి యాద్గిర్ వెళ్లే జా తీయ రహదారిపై ఉన్న చేవెళ్ల బస్టాండ్‌ను భవిష్యత్తులో నగర అవసరాలకే కాకుండా అంతర్రాష్ట్ర ప్రయాణికుల అవసరాలను కూడా తీర్చేలా ఆధునీకరించనున్నారు. రూ.3 కోట్లతో అత్యాధునిక శైలిలో నిర్మించనుండగా, డిజైన్ల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. డిజైన్లు ఖరారైన తర్వాత టెండర్లు పిలిచి పనులను చేపడుతామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.