షాబాద్, అక్టోబర్ 21 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ చేవెళ్ల నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తాయన్నారు.
ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్యే యాదయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఆయా మండలాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చేవెళ్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, చేవెళ్ల మండల టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రాములు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.