కులకచర్ల, అక్టోబర్ 21 : మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కృషిచే యాలని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించిందని, ప్రభుత్వం కల్పించిన వనరులతో పాటు స్థానిక వనరులతో గ్రామాలను అభివృద్ధి చేయా లన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను ఆదర్శగ్రామాలుగా చేసేందుకు గ్రామ పం చాయతీలకు ప్రత్యేకించి నిధులను కేటాయించిందని, నిధులతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, వీధిదీపాలు తప్పని సరిగా ఉండే విధంగా చూడాలని, ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగుతుందని, విద్యుత్ సరఫరాలో సమస్య లేకుండా విద్యుత్ అధికారులు చూడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో ఉన్న సమస్యలను సభలో వివరించారు. వచ్చే సర్వసభ్య సమావేశం నాటికి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
కార్యక్ర మంలో ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, తహసీల్దార్ రమేశ్‌కుమార్, ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో కరీమ్, డీఈ ఉమేశ్‌కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, వివిద శాఖ అధికారులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.