షాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల సేవలు ఎంతో బాగున్నాయని.. అవి రైతులకు ఎంతో దోహదపడుతున్నాయని నెదర్లాండ్ కో-ఆపరేటివ్ అధికారుల బృందం ప్రశంసించింది. గురువా రం ఉదయం నెదర్లాండ్‌కు చెందిన 13 మం దితో కూడిన అధికారుల బృందం సభ్యులు మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. రైతులకు అందిస్తున్న రుణా లు, ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. అనంతరం సర్దార్‌నగర్‌లో రూ.1.76 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజీని పరిశీలించి మాట్లాడుతూ.. తెలంగాణలో సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేం దుకు కోల్డ్‌స్టోరేజీని నిర్మించడం చాలా బా గుందన్నారు. ఆ బృందం సభ్యులకు షాబా ద్ సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, సీఈవో శివకుమార్‌రెడ్డి బ్యాంకు నుంచి రైతులకు అందుతున్న సేవలను వివరించా రు. తమ బ్యాంకు పరిధిలో 929 మంది రైతులకు రూ. 22.12 కోట్ల ఎల్ట్రీ రుణాలు, 353 మంది రైతులకు రూ. 3.91కోట్ల గోల్డ్ లోన్లు, 852 మంది రైతులకు రూ. 6.26 కోట్ల లోన్లు అందించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.50 లక్షల ఎరువులు, రూ. 8 లక్షల విత్తనాలు, రూ. 4.50 లక్షలను రైతులకు అందించామన్నారు. సహకార సంఘాల సేవలు రైతులకు ఎంతో దోహదపడుతున్నాయని బృందం సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు రిటైర్డ్ జీఎం షరీఫ్, టెస్కాబ్ ఏజీఎంలు ప్రజేశ్, ఆదిత్య, డీసీసీబీ ఏజీఎం రమేశ్, డైరెక్టర్ రామచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.