మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూనే ప్రజలకు కల్తీలేని ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలిచ్చి ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో రూ.9.34 కోట్లతో 160 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందించనున్నారు. ఇక్కడ తయారైన ఉత్పత్తులను సెర్ప్ ఆధ్వర్యంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెటింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తినుబండారాలు, పాల పదార్థాలు, పచ్చళ్లు, పప్పులు, నూనెలు తదితర ఆహార పదార్థాలను ఈ యూనిట్లలో శుద్ధి చేసి విక్రయించనున్నారు. మంజూరు చేసిన రుణాల్లో ఆయా యూనిట్ల ఆధారంగా 25నుంచి 35శాతం వరకు సబ్సిడీ అందించనుండగా.. మిగతా రుణాన్ని వాయిదాల వారీగా చెల్లించాలి.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 19: ఆహారశుద్ధి రంగం లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. కల్తీలను అరికట్టి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలో 160 ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను రూ.9.34 కోట్ల తో నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో రూ. 8.40 కోట్లను బ్యాంకులు రుణాలుగా ఇవ్వనుండ గా.. రూ.93.44 లక్షలను ఆయా యూనిట్ల లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నిధులతో ఎంపికైన లబ్ధిదారులకు వస్తువుల తయారీకి అవసరమైన పరికరాలు, ముడిసరుకును అందించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది. ఆ జాబితా ప్రకారం యూనిట్ కిం ద గరిష్ఠంగా ఒక్కొక్కరికీ రూ. 50 వేల నుం చి రూ.5లక్షల వరకు బ్యాంకులు రుణాలను అందించనున్నాయి. రాష్ట్ర స్థా యి నుంచి డీఆర్డీఏకు అక్కడి నుంచి మండల, గ్రామ సమాఖ్యలకు నిధులు విడుదల అవుతాయి.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయటంతోపాటు కల్తీలేని ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో మిర్చిపొడి, పసుపు పొడి, అల్లంవెల్లులి పేస్ట్, కొబ్బరి, నువ్వుల నూనె, గరం మసాలా పౌడ ర్లు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, మిక్చర్ వంటి నిత్యావసర వస్తువులు అనేక రకాలుగా కల్తీ అవుతున్నా యి. వాటిని వినియోగించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వాటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ప్ర భుత్వం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్య లు చేపట్టింది. ఈ యూనిట్ల ఏర్పాటుతో కల్తీకి ఆస్కారం ఉండదు. ప్రతిరోజూ అధికారుల పర్యవేక్ష ణ ఉంటుంది. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు శుద్ధి చేసి లభిస్తాయి. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ఫ్లిప్కార్డుతో ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందం మేరకు మహిళా సంఘాల సభ్యులు తమ ఉత్పత్తుల ను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విక్రయించుకోనున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో 20 రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సేమియా ప్యాకెట్ల తయారీ, కల్తీలేని కారం, పసుపుపొడి, కొబ్బరి, జొన్న రాగి లడ్డూలు, జొన్న, గోధుమ, రాగి, బియ్యం, శనగపిండి, మురుకులు, జెంతికలు, మసాలాల తయారీ, కందిపప్పు, పెసర పప్పు తయారీ, స్వీట్, మిక్చర్, పచ్చళ్ల తయారీ, రవ్వ, ఇడ్లీ, అల్లం వెల్లులి పేస్ట్, వేరుశనగనూనె, కొబ్బరి, నువ్వుల నూనె, గరం మసాలాపౌడర్ల తయారీ, పాల నుంచి నెయ్యి, కొవ్వ వంటి వాటి తయారీ, బేకరీ ఉత్పత్తులు, అప్పడాల తయారీ, ఆవాలు, లవంగాలు, యాలకులు, డ్రైఫూడ్స్ ప్యాకింగ్ ఇలాం టి అనేక ఆహార ఉత్పత్తులకు సంబంధించిన చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యం గా డ్వాక్రా మహిళలు ఆయా వస్తువుల తయారీలో కొత్తవారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన మహిళలకు వారి నైపుణ్యం ఆధారంగా బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఆయా యూనిట్ల ఆధారంగా 25 నుంచి 35శాతం వరకు సబ్సిడీ ఉం టుంది. మిగతా రుణాలను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో ప్రభుత్వం 160 ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి ఐదు మంజూరు కాగా.. ఆమనగల్లుకు 4, చేవెళ్లకు 7, చౌదర్‌గూడకు 5, ఫారూఖ్నగర్కు 17, ఇబ్రహీంపట్నానికి 5, కడ్తాల్‌కు 9, కందుకూరుకు 6, కేశంపేట్కు 11, కొందుర్గుకు 8, కొత్తూరుకు 8, మాడ్గులకు 5, మహేశ్వరానికి 4, మంచాలకు 5, మొయినాబాద్‌కు 8, నందిగామకు 20, షాబాద్‌కు 7, శంషాబాద్‌కు 5, శంకర్‌పల్లికి 6, తలకొండపల్లికి 6, యాచారానికి తొమ్మిది చొప్పున మంజూరయ్యాయి.
ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మహిళలు ఆర్థికం గా అభివృద్ధి చెందేం దుకు ఎంతో దోహదపడుతుంది. ప్రజలకు నాణ్యమైన ఆహా ర పదార్థాలను అందించేందుకు ప్రభుత్వం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం. సబ్సిడీపై రుణాలను అందిస్తూ మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీ యం. మహిళలు సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. -నీలం శ్వేత, మహిళ
ప్రజలకు ఎలాంటి కల్తీ లేని ఆహార పదార్థాలను అం దించడంతోపాటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 160 ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆయా రం గాల్లో నైపుణ్యం ఉన్న మహిళలతో కల్తీలేని ఆహార పదార్థాలను తయారు చేయించి ఫ్లిప్‌కార్డ్ ద్వారా ప్రజలకు అందించనున్నాం. ఆసక్తి ఉన్న మహిళలకు రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తాం.
-ప్రభాకర్, డీఆర్డీఏ, రంగారెడ్డిజిల్లా