తలకొండపల్లి, అక్టోబర్ 20 : ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో వాలీబాల్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే ప్రతి గ్రామంలో క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడలు ఆడేందుకు వీలుగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు ఉచిత శిక్షణ శిబిరాలు ఉపయోగపడుతాయని అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన క్రీడాకారుడు మహేశ్ బీచ్ వాలీబాల్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో ఎమ్మెల్యే తోపాటు నాయకులు ఘనంగా సత్కరించారు. వాలీబాల్ యూత్ అధ్యక్షుడు మల్లేశ్ క్రీడాకారులకోసం రూ.3లక్షలతో నిర్మించిన మినీ వాటర్‌ట్యాంక్, హారిజెంటల్ బార్, డబుల్‌బార్, లాంగ్జంప్కిట్టులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, దేవాలయ కమిటీ చెర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ రమేశ్, ఉపసర్పంచ్ తిరుపతి, ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, వాలీబాల్ యూత్ సభ్యులు మహేశ్, రాజు, శ్రీశైలం, వెంకటేశ్, కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, బాలు, దుర్గా, ఆర్.మహేశ్, టీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్, శంకర్‌నాయక్, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు.