తాండూరు, అక్టోబర్ 19: తాండూరు పట్టణంలో నేషనల్ హైవే రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం వ్యాపారం పరంగా విస్తరిస్తు న్నది. లక్ష జనాభా ఉన్న పట్టణం వాహనాల రద్దీకనుగుణంగా విస్తరణ పనులు జరుగు తున్నాయి. అండర్‌డ్రైనేజీ నిర్మాణాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి కట్టడాల కూల్చివేతకు సహకరిస్తున్నారు. బుధవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం రాకపోకలు, వర్షంతో దెబ్బతిన్న తాండూరు నియోజకవర్గం పరిధిలోని ఆర్‌ఆండ్‌బీ రోడ్లు ఇక సాఫీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేక నిధులు కేటాయించి టెండర్లకు ఆహ్వానం పలికారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చక్కటి రోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. 167 నేషనల్ హైవేలో భాగంగా రూ.27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ వరకు రోడ్డుపనులు చకచకా నడు స్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీల భారీ వాహనాలు ఎక్కువగా తిరిగే గౌతాపూర్- కరణ్‌కోట్ రోడ్డు వేసేందుకు సర్కార్ ఆమోదం లభించింది. త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభం కానున్నాయి. జిన్గుర్తి-తట్టెపల్లి రోడ్లతో పాటు బైపాస్ పనులపై కూడ సమీక్ష చేసి పూర్తి చేస్తామన్నారు.
కాలుష్యరహిత తాండూరుకు కృషి
కాలుష్యరహిత తాండూరు ఏర్పాటుతో పాటు అభివృద్ధిలో నంబర్-1గా చేయాలనే సంకల్పంతో పను లు చేస్తున్నాం. నియోజకవర్గంలో బైపాస్, హైవే రోడ్లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్ల పనుల కు ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రా రంభించాము. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. -పి.రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాండూరు