వికారాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ సీజన్లో పంటల సాగు భారీగా పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేరుశనగ, శనగ, కుసుమ, జొన్న విత్తనాలను నాటుతుండగా మిగిలిన పం టలను వచ్చేనెల మొదటి వారంలోపు పూర్తి చేయనున్నారు. వరి నాట్లు మాత్రం డిసెంబర్ మూడో వారం తర్వాత జరుగనున్నాయి.
వ్యవసాయాధికారులు రూపొందించిన సాగు ప్రణాళికకు అనుగుణంగా అధికారులు విత్తనా లు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. సరిపడా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అం దుబాటులో ఉండగా.. కొంత మంది రైతులు ఎరువులను కొనుగోలు చేస్తున్నా రు. జిల్లాలో రైతులకు పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులను సరఫరా చేస్తున్నారు.కాగా జిల్లాకు అన్ని రకాల ఎరువులు కలిసి 28 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటివరకు జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు, సొసైటీల వద్ద 15 వేల మెట్రిక్ టన్నుల వరకు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసా
ఈ ఏడాది యాసంగి సీజన్లో 1,47,502 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వరి పంట సాగు విస్తీర్ణం అంచనాలకు మిం చి పెరుగుతుందని భావిస్తున్నారు. గత యాసంగిలో వరి పంటను సాగు చేయకుండా ఇతర ప్ర త్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు సూచించడంతో జిల్లాలోని రైతులు కేవలం 43,785 ఎకరాల్లోనే పంటలేశారు. అయితే ఈ యాసంగి సీజన్లో వరి సాగు 71,500 ఎకరా ల్లో సాగు అవుతుందని అధికారులు ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ, లక్ష ఎకరాల వరకు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వరి సాగు విషయంలో ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతోపాటు ఈ వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో 90 శాతం చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్న దృష్ట్యా వరి సాగు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
అయితే కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టుల కింద 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. ఆయా ప్రాజెక్టుల కింద రైతులు దాదాపుగా వరినే సాగు చేయనున్నా రు. గతేడాది ఆయా పంటల సాగు విస్తీర్ణం 1,04,528 ఎకరాలు కాగా ఈ ఏడాది 1,47,502 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. వరి గతేడాది 43,785 ఎకరాల్లో సాగు కాగా ఈ యాసంగిలో 71,500ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో దాదాపుగా 28 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు పెరుగనున్నది. అంతేకాకుం డా ప్రాజెక్టులు, చెరువులు, బోర్లలో పుష్కలం గా నీరున్న దృష్ట్యా వరి సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల వరకు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
యాసంగి సాగుకు అంతా సిద్ధం చేశాం. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వరి పంట సాగు గతేడాది కంటే భారీగా పెరుగనున్నది. దాదాపు లక్ష ఎకరాల వరకు సాగు కావొచ్చు. ఇప్పటికే రైతులు వేరుశనగ, శనగ, కుసుమ తదితర పంటల విత్తనాలను నాటుతున్నారు. వరి నాట్లు మాత్రం డిసెంబర్ మూడో వారం తర్వాత జరుగుతాయని భావిస్తున్నాం.
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి