కులకచర్ల, అక్టోబర్ 17: అర్హులైన పోడుభూముల రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చేందుకు కృషిచేస్తున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ మండల పరిధిలోని మక్తవెంకటాపూర్ గ్రామాల్లో పోడు భూములపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ చాలా కాలంగా అటవీశాఖ భూములు సాగు చేసు కుంటున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు కృషిచే స్తున్నదన్నారు. ముజాహిద్‌పూర్‌లో నిర్వహించిన గ్రామ సభ లో తహసీల్దార్ రమేశ్‌కుమార్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, గ్రామ స్తులు పాల్గొనగా మక్తవెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, నాయకులు వెంకట్, అశోక్, పులిరాములు, శంకర్, మక్తవెంకటాపూర్ గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కోట్‌పల్లి , అక్టోబర్ 17 : మండలంలోని ఇందోల్ గ్రామంలో పోడు భూములకు 100 దరఖాస్తులు రాగా సోమవారం 20 దరఖాస్తులను తహసీల్దారు రసూల్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ సర్పంచ్ రాంచందర్ అధ్యక్షతన పరిశీలించారు. సర్కారు సూచించిన విధంగా సరైన పత్రాలు లేనందుకు వీరి దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు.. పొడు భూములకు సంబంధించి 2005 కంటే ముందు నుంచి అ భూముల్లో వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తూ ఆ గ్రామంలో ఉంటేనే పోడు భూముల హక్కులు పొందుతారని మండల అధికారులు తెలిపారు.
పెద్దేముల్, అక్టోబర్ 17 : రైతులకు పోడు భూముల పట్టాలను అందించడానికి చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ కె. మహేశ్, ఎంపీడీవో లక్ష్మప్ప అన్నారు. సోమవారం ఆత్కూర్లో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని అనంతరం పోడు భూముల సర్వేను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్కూర్లో మొత్తం 101 దరఖాస్తులు స్వీకరించామని, రోజు 25 చొప్పున ఫీల్డ్ సర్వే చేసి డివిజనల్, జిల్లా స్థాయి అధికారులకు ఓ నివేదిక రూపంలో పంపిస్తామన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ, ఎంపీడీవో లక్ష్మప్ప, ఆర్ఐ రాజురెడ్డి పాల్గొన్నారు.