ఆర్కేపురం, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ…రేటింగ్ కోసం కాదని.. ప్రజల కోసం పనిచేయాలని, ఢిల్లీలో ఫొటోలకు ఫోజులివ్వటం కాదని, గల్లీల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బైక్ పోతే బైక్, కారు పోతే కారు ఇస్తామన్నారని, మరి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడి తే లైకులతో పనికాదని, బస్తీల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయని, యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. మహేశ్వరంలో రూ.720 కోట్లతో మలబార్ గోల్డ్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో 58 కంపెనీలు ఏర్పాటు అయ్యాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీగా ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోనూ రాణిస్తుందన్నారు. మునుగోడులో గులాబీ పార్టీ ఘన విజయం సాధి స్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, నాయకులు మహేందర్‌యాదవ్, సిరిపు రం రాజేశ్‌గౌడ్, సలీం పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో 200 మంది చేరిక బడంగ్‌పేట : మునుగోడు నియోజకవర్గం
నాంపల్లి మండలంలోని నామనాయక్ తండాలోని వివిధ పార్టీలకు చెందిన సు మారు 200 మంది నాయకులు, కార్యకర్తలు నగరంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో సబితాఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. కార్యక్రమం లో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, నాంపల్లి జడ్పీటీసీ రెడ్డి, సర్పంచ్ సుగుణాశంకర్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ముఖ్యనాయకులు అరవింద్ శర్మ, లచ్చా నాయక్, రాజూనాయక్ పాల్గొన్నారు.