తుర్కయాంజాల్, ఆక్టోబర్ 12 : ప్రజలంతా ఆరోగ్యం ఉండాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యం చేరువ చేయడంతోపాటు పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బస్తీ దవాఖానల్లో రోజూ డాక్టర్ అందుబాటులో ఉంటాడని.. ప్రజలంతా ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బు వృథా చేసుకోకుండా బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆనంద్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత, కౌన్సిలర్లు హరిత, స్వాతి, భాగ్యమ్మ, ఉదయశ్రీ, మంగమ్మ, సునీల్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి, రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, సంపతీశ్వర్రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ధన్‌రాజ్ ఉన్నారు.
వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట
ఆదిబట్ల : వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని.. ఇందులో భాగంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. ఆదిబట్లలో బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. త్వరలోనే కొంగరకలాన్లోనూ బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు కృషితో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. గతంలో ఆదిబట్ల ప్రజలు ఇక్కడి నుంచి వైద్యం కోసం ఎలిమినేడు ప్రభుత్వ దవాఖానకు వెళ్లేవారని.. ఇప్పుడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ దవాఖానను ఉపయోగించుకోవాలని కోరారు.
నల్లాబిల్లులు కట్టలేం.. తగ్గించండి..
తాము రోజు కూలి చేసుకుని బతికేవాళ్లమని.. నల్లాబిల్లులు ఎలా కట్టాలని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. బిల్లులు తగ్గించాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో ప్రభుత్వ భూమి ఉందని.. తమకు అందులో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, బస్తీ దవాఖాన ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, డాక్టర్లు అభిరాం, ప్రదీప్, చైర్మన్ ఆర్తీక, వైస్ చైర్మన్ కళమ్మ, కోఆప్షన్ సభ్యుడు గోపాల్‌గౌడ్, కౌన్సిలర్లు లావణ్య, శ్రీను, మహేందర్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు రాజు, వీరేశ్ పాల్గొన్నారు.