రంగారెడ్డి, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఎంతో కృషి చేస్తున్నది. వారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ అనే పథ కాన్ని గత ఐదేండ్లుగా అమలు చేస్తున్నది. గిరిజనులు పరిశ్రమలను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) భాగస్వామ్యంతో ‘ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూయర్స్(టీఐటీసీఈ) ద్వారా మార్కెటింగ్.. ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ కోసం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, ఇంకా ట్రైకార్ సంస్థ నుంచి ఆర్థికసాయం పొందేలా ఈ స్కీమ్‌ను గిరిజనుల బాగుకోసం ప్రభుత్వం తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్(సీఐఈ), ఐఎస్బీ ఆధ్వర్యంలో ప్రతిఏడాది జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వంద మంది ఔత్సాహికులను ఎంపిక చేసి.. వారికి పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణను అందిస్తున్నది. ఇందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నిధుల సమీకరణ ఇలా..
సబ్సిడీ గరిష్ఠంగా రూ.50,00,000 లక్షలకు లోబడి యూనిట్ ధరపై 35%గా ఉంటుంది.
షెడ్యూల్డ్ ఏరియాలో ఏదైనా సంస్థను ఏర్పాటు చేస్తే అదనపు 5% సబ్సిడీ, అంటే యూనిట్ ధరపై 40%, గరిష్ఠంగా రూ. 50,00,000 లక్షలకు లోబడి ఉంటుంది.
గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు పది శాతం సబ్సిడీ (యూనిట్ ధరపై 45% గరిష్ఠంగా రూ. 50,00,000 లక్షలకు లోబడి ఉంటుంది. )
యూనిట్ ఖర్చులో పది శాతం లబ్ధిదారుడు కంట్రిబ్యూషన్‌గా చెల్లించాలి
lమిగిలిన మొత్తాన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందొచ్చు.
అర్హులు..
లబ్ధిదారులు ఏదైని డిగ్రీలో పట్టభద్రులై ఉండాలి (గ్రాడ్యుయేట్స్ కాని వారు చిన్న, కుటీర పరిశ్రమలను నెలకొల్పుకునే అవకాశం ఉంటుంది)
స్థాపించబోయే సంస్థపై పూర్తి అనుభవం కలిగి ఉండాలి.
ఈ పథకం నిబంధనల మేరకు, యూనిట్ ధరలో పది శాతం కంట్రిబ్యూషన్‌గా పెట్టుబడి పెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
పది మందికి ఉపాధి కల్పించేలా..
గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. చిన్న, పెద్ద తరహా పరిశ్రమల స్థాపనకు ట్రైకార్ సంస్థ ఆర్థిక సాయా న్ని అందిస్తున్నది. పరిశ్రమలను స్థాపించి పది మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. చిన్నతరహా పరిశ్రమలైన గానుగ నూనె తీయ డం, కారం పొడులు రైస్, మెడికల్ ల్యాబ్స్ నుంచి పెద్ద తరహా పరిశ్రమల స్థాపనకు ఈ స్కీమ్ ఎంతో వారికి దోహదపడుతుంది.
– కేఈ రామేశ్వరిదేవి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా
అర్హులు ఈనెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలోని గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు.. వారు స్థాపించిన సంస్థల్లో పదిమందికి ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్, ఇన్నోవేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూ ల్ ఆఫ్ బిజినెస్ సంస్థ ద్వారా ఔత్సాహికులకు సామర్థ్యాల పెంపుదల శిక్షణను అధికారులు ఇప్పిస్తారు. అదేవిధంగా పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ట్రైకార్ సంస్థ ఆర్థిక సాయాన్ని అందించనున్నది. ఆసక్తి, అర్హత కలిగిన గిరిజన ఔత్సాహికులు ఈ నెల 31 వతేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. వివరాలకు http://tsobmms.cgg.gov.inలో సంప్రదించాలని వారు సూచించారు.