స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్లలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నదన్నారు. అందులో భాగంగానే రైతుబంధు, రైతుబీమా వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను తీసుకొచ్చిందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో గతంలో మూడు మార్కెట్ కమిటీలుండేవని, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య వినతిమేరకు సీఎం కేసీఆర్ మండలానికో కమిటీని ఏర్పాటు చేశారన్నారు.
చేవెళ్ల టౌన్, అక్టోబర్ 10: సీఎం కేసీఆర్‌ది రైతు సంక్షేమ పాలన అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరిగిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో చేవెళ్ల నియోజకవర్గంలో మూడు మార్కెట్ కమిటీలుండగా.. ప్రస్తుతం ప్రతి మండలానికీ ఒక మార్కెట్ కమిటీని ఎమ్మెల్యే యాదయ్య కోరిక మేరకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ బోరు మోటర్లకు మీటర్లు పెడుతామంటే సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు. మార్కెట్ కమిటీలను ఎత్తేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మన సీఎం వ్యతిరేకించారన్నారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని.. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుకు బీజేపీ యత్నిస్తున్నదన్నా రు. రాష్ట్రంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అవగాహన సదస్సులను నిర్వహిస్తుంటే క్షుద్ర పూజలు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
మునుగోడులో అధికార పార్టీదే విజయం
ముఖ్యమంత్రిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఘన విజ యం సాధిస్తుందని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నా రు. రాష్ట్రంలో గతంలో మొత్తం సాగు విస్తీర్ణం కోటీ34లక్షల ఎకరాలు అయితే 2020-21 నాటికి 2కోట్ల15 లక్షలకు చేరిందని.. ఇందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలే కారణమని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.
2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం రాగా.. ప్రభుత్వం అం దించిన ప్రోత్సాహంతో ప్రస్తుతం మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని.. దేశంలో పంజాబ్ తర్వాత స్థానంలో మన రాష్ట్రం నిలిచిందని ఆమె గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే రూ.57,880కోట్లను పంట పెట్టుబడిగా అందించిన రాష్ట్రం గా తెలంగాణ ప్రపంచ వేదికలపై ప్రశంసలు పొందిందని.. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధును అత్యుత్తమ పథకం గా అభివర్ణించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం లో ఏడాదికి రెండు పంటలను రైతులు సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతును రాజుగా మార్చాడన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో 2,604 రైతు వేదిక భవనాలను నిర్మించిందన్నారు.
పథకాలను ప్రచారం చేయాలి
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచా రం చేయాలని మంత్రి సబితారెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాగా మంత్రి సబితారెడ్డి సమక్షంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వ ర్యంలో చేవెళ్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేశారు. వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయా కార్య క్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, నరహరిరెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, జంగారెడ్డి, స్వర్ణలతాదర్శన్, నాగార్జున రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు రాజు, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమం ప్రారంభానికి ముందు చేవెళ్లలో భారీ ర్యాలీని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు నిర్వహించి మంత్రికి ఘన స్వాగ తం పలికారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. రైతుల సంక్షేమం, భరోసా కల్పించేందుకు గుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఎలాంటి దరఖాస్తు లేకుండానే రూ. ఐదు లక్షల వరకు రైతుబీమాను బాధితుడి కుటుంబానికి అందిస్తూ ప్ర భుత్వం ఆదుకుంటున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నదన్నారు. తెలంగాణలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
చేవెళ్ల ఏఎంసీ నూతన పాలకవర్గం ఇదే
చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మండలంలోని దామరిగిద్ద గ్రామానికి చెందిన మిట్ట వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా తల్లారం గ్రామానికి చెందిన బేగరి నర్సింహులుతోపాటు డైరెక్టర్లుగా కరుణాకర్‌రెడ్డి, వెంకటేశ్, కృష్ణ, సుమలతా సాయికుమార్, మహేశ్, తిరుపతిరెడ్డి, కృష్ణానాయక్, ఫయాజుద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్, సతీశ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డీఎంవో చాయాదేవి, ఏడీఏ రమాదేవి, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, పాలక మండలి సభ్యులను మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అభినందించారు.
అదృష్టంగా భావిస్తున్నా..
చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నా. మా ర్కెట్ కమిటీ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతిరోజూ రైతులకు అందుబాటులో ఉం డి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం మన అదృష్టం. ఆయన దేశ రాజకీయాల్లో రాణిస్తే రైతులందరికీ మేలు జరుగుతుంది. నాపై నమ్మకం ఉంచి ఏఎంసీ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మిట్ట వెంకటరంగారెడ్డి, చేవెళ్ల ఏఎంసీ నూతన చైర్మన్