పరిగి, అక్టోబర్ 10: నేర చరిత్ర కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం పరిగిలో డివిజన్ స్థాయి హిస్టరీ షీట్స్మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. నేర చరిత్రలో మార్పు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిగి డివిజన్ పరిధిలో 164 మందిపై హిస్టరీషీట్స్ ఉన్నాయని, వారిలో103మందిపై రౌడీషీట్స్, 61 మం దిపై సస్పెక్ట్ షీట్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
నేర చరిత్ర గల వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించడం, గత పదేండ్లలో వారిపై ఎలాం టి కేసులు నమోదు కాని వారితోపాటు 60 ఏండ్లు పైబడిన వారు, ప్రమాదంలో అంగవైకల్యం పొంది బయటికి రాలేని వారిలోని మార్పు, మంచితనాన్ని పరిగణనలోకి తీసుకొని హిస్టరీ షీట్స్ మూసివేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. గ్రా మాల్లో చిన్న, చిన్న విషయాలకు గొడవలు పడి కేసుల్లో ఇరుక్కుంటున్నారని, గ్రామాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఇబ్బందులు ఉండవని చెప్పారు. పోలీసు శాఖలోనూ అనేక మార్పులు వచ్చాయన్నా రు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, పరిగి, కొడంగల్ సీఐలు వెంకటరామయ్య, అప్పయ్య, డీపీవో, ఎస్పీ సీఐలు డి.శంకర్, నాగేశ్వర్రావు, పరిగి, దోమ, కులకచర్ల, చన్గోముల్, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల ఎస్ఐలు విఠల్‌రెడ్డి, విశ్వజన్, గిరి, భీంకుమార్, శంకర్, రవికుమార్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.