ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 10 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధిక శాతం రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం గింజ పోసుకునే దశలో పరుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడిని పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల మండలాల్లో 35వేల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం సుడిదోమ, మొగిపురుగు, పాముపొడ, నల్లకంకి వంటి తెగుళ్లు సోకే అవకాశం ఉన్నది. వాటి నివారణకు వ్యవసాయాధికారుల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ పేర్కొన్నారు.
నల్లకంకి తెగులు..
వరి పంటకు నల్లకంకి తెగులు సోకితే 30 శాతం వరకు పంట దిగుబడి నష్టపోవాల్సి వస్తుంది. గింజ నాణ్యత కూడా తగ్గుతుంది. నల్లకంకి తెగులు కంకినల్లి అనే పురుగు నుంచి వస్తుంది. ఈ కంకినల్లి ఆకుమట్టల్లో, ఆకు మధ్య ఈనెల్లో గుంపులుగా నివసిస్తాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. వీటిని సులభంగా గుర్తించలేరు. గింజ పాలుపోసుకునే దశలో గింజలను ఆశించి నష్టపరుస్తాయి. తొలి దశలోనే ముదురుగోధుమ నుంచి నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
నివారణ చర్యలు..
మొగి పురుగు..
మొగి పురుగు వరి పంటకు నారు మడి దశనుంచి గింజ పోసుకునే దశ వరకు ఆశిస్తుంది. తల్లి పురుగు ముదురు రంగులో ఉండి ముందు రెక్కలపై నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. గోధుమరంగు వెంట్రుకలతో కప్పిన గుడ్లను గుంపులుగా నారుమళ్లలో పెడుతాయి. నాటిన పొలంలో అయితే మొక్కల ఆకుల చివరి భాగాల్లో పెడుతాయి. మొక్క జిలకలు తొలిగే దశలో పురుగు ఆశిస్తే ఎండిపోతాయి. పురుగు ఆశించిన మొక్కల మొవ్వలు, కంకులను లాగితే అవి తేలికగా బయటకు వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నివరాణ చర్యలు..
సుడి దోమ..
వరి పంటకు అధికంగా నత్రజనిని అందించడం వల్ల సుడి దోమ పంట పొలంలో వ్యాప్తి చెందుతుంది. గోధుమ వర్ణం కలిగిన ఈ సుడి దోమలు వరి దుబ్బల మొదళ్ల వద్ద నీటి మట్టంపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీంతో పంట సుడులు, సుడులుగా ఎండిపోతుంది. ఈ సమయంలో సుడి దోమను వెంటనే నివారించకపోతే పంట అంతా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
నివారణ చర్యలు..
సరైన జాగ్రత్తలు పాటించాలి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 35వేల ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. ప్రస్తుతం గింజపోసుకునే దశలో చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో మందులను పిచికారీ చేయాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తేనే పంట దిగుబడి వస్తుంది.
– సత్యనారాయణ, ఏడీఏ ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ