పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ప్రస్తుతం ఉన్న వేతనం రూ. 8,500 నుంచి రూ. 11,050లకు పెంచుతూ దసరా కానుకగా జీవోను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంరక్షణ, సంతతి వృద్ధి, నట్టల నివారణ మందు పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు గోపాల మిత్రలను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదు. రూ.3,500 వేతనాన్ని 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 8,500లకు పెంచారు. తాజాగా మళ్లీ వేతనం పెంచడంతో గోపాల మిత్రలు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 47 మంది గోపాల మిత్రలకు లబ్ధి చేకూరనున్నది.
షాబాద్, అక్టోబర్ 9: పశు సంవర్ధకశాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం వారికి అందిస్తు న్న వేతనంపై మరో 30 శాతం పెంచింది. పశువుల సంరక్షణ, వాటి సంతతి వృద్ధికి కృషి చేస్తున్న వీరికి వేతనాన్ని మరోసారి పెంచి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప మనుస్సును చాటుకున్నది. ప్రస్తుతం వారి వేతనం రూ. 8,500 నుంచి రూ.11,050కు చేరుకున్నది. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో గోపాల మిత్రలు నెలకు కేవలం రూ.రెండు వేల గౌరవ వేతనాన్ని మాత్రమే అందుకున్నారు. చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. 2017లో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతినెలా రూ.8,500 చొప్పున వేతనాన్ని అందుకుంటున్నారు. తాజాగా మళ్లీ వేతనం పెరుగడంతో గోపాలమిత్రలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా శ్రమను గుర్తించి సీఎం కేసీఆర్ మరోసారి వేతనాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ప్రభుత్వం పెంచిన వేతనంతో రంగారెడ్డి జిల్లాలోని 47 మంది గోపాల మిత్రలకు లబ్ధి చేకూరనున్నది. దసరా పండుగ వేళ వారి గౌరవ వేతనాన్ని పెం చుతూ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది. పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న వీరు పశువుల సంరక్షణ, సంతతి పెంపు విషయంలో కీలకంగా పనిచేస్తున్నారు. కృత్రిమ గర్భధారణతో మేలు ర కం జాతి పశువుల సంతతిని పెంచడం, పశుగ్రా సం పెంపు, దూడల పోషణ, పశువుల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు నట్టల నివారణ మందు పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో పశువైద్య సిబ్బందికి సహాయపడుతున్నారు.
ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. వారి శ్రమ కు తగ్గ వేతనాన్ని అందిస్తున్నది. గోపాల మిత్రలకు రెండోసారి ప్రభుత్వం వేతనాన్ని పెంచింది. ప్రస్తుతం రూ.8,500 అందుతుండగా తాజా పెం పుతో రూ.11,050 చేరనున్నది. రెండోసారి వేతనాన్ని పెంచడం ద్వారా తమకు సముచిత గౌరవం దక్కిందని గోపాల మిత్రలు పేర్కొంటున్నారు.
గోపాల మిత్రలకు ప్రభుత్వం మరోసారి 30శాతం వేతనాన్ని పెంచడంతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. జిల్లాలోని 47 మంది గోపాల మిత్రలు లబ్ధిపొందుతారు. ప్రస్తుతం రూ.8,500 అందుతుండగా తాజా పెంపుతో రూ.11,050 చేరనున్నది.
-డాక్టర్ శ్రావణ్‌కుమార్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, ఏడీ
తెలంగాణ ప్రభుత్వం మా శ్రమను గుర్తించి వేతనాన్ని మరో 30 శా తం పెంచడం సంతోషం గా ఉన్నది. కొన్నేండ్లుగా తక్కువ వేతనంతో పని చేస్తున్నాం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మాకు రెండుసార్లు వేతనాలను పెంచారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పశువులకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందు పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాం. -విద్యాసాగర్, గోపాలమిత్ర, షాబాద్