వికారాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. పదేండ్లుగా గుక్కెడు తాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కపూట భోజనం లేకున్నా మానవుడు జీవించొచ్చు కానీ.. నీరు లేకుండా ఉండటం చాలా కష్టం ..అలాంటిది పదేండ్లు నీటి కోసం అల్లాడారు బొంరాస్‌పేట మండలంలోని దేవులనాయక్ తండావాసులు. చేతుల్లో బిందెలు పట్టుకుని ఇండ్లలోని చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకుని దాహాన్ని తీర్చుకున్నారు. తండాలో ఎక్కడా నీరు దొరక్కని పరిస్థితి..తండాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లు, మద్దిగుంటలోని చెలిమెకు వెళ్లి తాగునీటిని తీసుకొచ్చుకునే దయనీయ పరిస్థితి ఉండేది. నీటి కష్టాలతో వారానికోసారి స్నానం చేస్తుండేవారు. అప్పటి పాలకులు తండావాసుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎండాకాలంలో తమ కన్నీటి బాధలను తీర్చాలని అధికారులు, ప్రజాప్రతినిధుల ను వేడుకున్నా ఫలితం శూన్యం. తీవ్ర తాగునీటి గోసతో వేసవి వస్తే చాలు బీజాపూర్ రహదారిపై తండావాసులంతా కలిసి రాస్తారోకో చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.’ కానీ.. కేసీఆర్ ప్రభుత్వం రాకతో వారి దాహం తీరింది.
దేవులనాయక్తండాలో 50 ఇండ్లు ఉండగా.. అందులో దాదాపుగా 300 మందికి పైగా జీవిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ తండావాసులు పదేండ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో తండాలో ఎక్క డా 500 అడుగుల వరకు బోరు వేసినా నీరు వచ్చే పరిస్థితిలేదు. వ్యవసాయ బోర్లే వారికి దిక్కు. ఇలా వారు పదేండ్లుగా తాగునీటి కోసం నానా కష్టాలు పడ్డారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు తండాకు వచ్చి వెళ్లినా వారి కన్నీటి కష్టాలకు మాత్రం పరిష్కారం లభించలేదు. చివరకు సీఎం కేసీఆర్ 2018లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం వారి దాహాన్ని తీరింది.
తండావాసులు తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లపై ఆధారపడేవారు. ప్రతిరోజూ ఇండ్లలో ఉన్న చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి బిం దెలు తీసుకుని పొలాలకు వెళ్లేవారు. ఒక్కొక్క రూ నెత్తిపై మూడు బిందెల వరకు పెట్టుకొని నీటిని తెచ్చుకునేవారు. అయితే.. సీఎం కేసీఆర్ రెండోసారి ఎన్నికలకు వెళ్లే ముందు ఇంటింటికీ తాగునీటిని అందిస్తామని.. ఏ ఇంటి నుంచి కూడా ఆడపిల్లలు నీటికోసం బిందెలు పట్టుకుని వెళ్లకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందిస్తామని మాటిచ్చారు.. ఆయన చెప్పినట్లుగానే గడువులోగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. దీంతో నీటి చుక్క కూడా దొరకని దేవులనాయక్‌తండాకు మిషన్ భగీరథ నీరు రావడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేవు. తమ కన్నీటి కష్టాలు తీరాయంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ తండాలో 50 ఇండ్లుండగా… ఇంటింటికీ నల్లా కనెక్షన్లను అధికారులు ఇచ్చారు. ప్రతిరోజూ ఉద యం, సాయంత్రం సమయాల్లో మిషన్ భగీరథ నీరు వస్తున్నది. తమకు ప్రస్తుతం తాగునీటి కష్టాలు తీరాయని.. ఇండ్ల ఎదుటే నీటిని పట్టుకుని దాహాన్ని తీర్చుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కన్నీటి కష్టాలను తీర్చి న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉం టామని గిరిజనులంతా జై కొడుతున్నారు.
పదేండ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. దాహం తీర్చే నా థుడే కనిపించలేదు. తం డాలోని ప్రజల దాహాన్ని తీర్చేందుకు వ్యవసాయ బోర్లే ఆధారమయ్యాయి. ప్రతిరోజూ అర్ధరాత్రి సమయంలో ఇంటిల్లిపాది కలిసి వ్యవసాయ బోర్ల వద్దకెళ్లి నీటిని తెచ్చుకుని దాహాన్ని తీర్చుకున్నాం. కానీ.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిష న్ భగీరథ పథకంతో ఆ కష్టాలు తీరాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కిలోమీటర్ల మేర కాలినడకతో వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. నేరుగా ఇంటి ముందే ఉదయం, సాయంత్రం సమ యా ల్లో తాగునీరు వస్తున్నది. గిరిజనులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కేశనాయక్, తండావాసి
తండాలో తాగునీటి కోసం ఎన్నో తిప్పలు పడ్డాం. కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకెళ్లాం. ఒక్కొక్కరం నెత్తిపై మూడు బిందెల నీటిని పెట్టుకొని వచ్చేవాళ్లం. పండుగ సందర్భాల్లో నీటి కోసం తీవ్ర అవస్థలు పడా ల్సి వచ్చేది. వారానికోసారి స్నానం చేసేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకంతో మా తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇంటి ముందే నీటిని పట్టుకుంటున్నాం.
– పన్నీబాయి, వార్డు సభ్యురాలు
మిషన్ భగీరథ నీరు రాకుంటే దాహాన్ని తట్టుకోలేక తండాను వదిలి వలస వెళ్లాల్సి వచ్చేది. కానీ.. సీఎం కేసీఆర్ వచ్చి మా దాహాన్ని తీర్చా రు. పదేండ్లు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కిలోమీటర్ల మేర కాలినడకతో వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. గిరిజనుల అభివృ ద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. కేసీఆర్ వచ్చిన తర్వాతే తం డాలు పంచాయతీలుగా మారాయి.. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు వస్తున్నది.. గిరిజనుల రిజర్వేషన్‌ను పెంచడంతో నిరుద్యోగ యువతకు, విద్యార్థులు ఎంతో మేలు జరుగుతుంది.
– నెహ్రూ, తండావాసి