బొంరాస్‌పేట, అక్టోబర్ 3: ప్రజల చెంతకే పాలన చేర్చడం, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని దుద్యాలను ప్రత్యేక మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఆమె సోమవారం తాసిల్దార్, ఎంఈవో కార్యాలయాలను ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు స్వయం పాలన అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారన్నారు. అంతేకాకుండా దసరా కానుకగా దుద్యాల కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు గొప్ప విజన్ ఉందన్నారు. ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని, దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదన్నారు.
పరిపాలనాసౌల భ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నారని.. దీని ద్వారా పాలన ప్రజల ముందుకే వస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని..తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కూడా కావాలని అడుగుతు న్నారన్నారు. సోమవారం ఆమె బొంరాస్‌పేట మండలం నుంచి కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలను.. అదేవిధంగా బొంరాస్‌పేట మండ లం తుంకిమెట్లలో కాకరవాణివాగుపై రూ. 3.14 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను ప్రారంభించడంతోపాటు తుంకిమెట్లలో ఉపాధిహామీ నిధులు రూ.22 లక్షలతో నిర్మించనున్న కూరగాయల షెడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంత రం దుద్యాల మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన విజన్ ఉన్నదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి బ్యాంకు లింకేజీ లేకుండా రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.
అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన హామీ మేరకు వారి రిజర్వేషన్‌ను ఆరు నుంచి పదిశాతానికి సీఎం కేసీఆర్ పెంచినట్లు తెలిపారు. తద్వారా వారికి విద్యాఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే గిరిజనులకు కూడా గిరిజనబంధు అమలు కానున్నట్లు ఆమె తెలిపారు. రైతులకు పంట సాగు కోసం రైతుబంధుతోపాటు రైతు ఏదైనా కారణంతో మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా కింద డబ్బులను అందిస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఇవేకాకుండా కల్యాణలక్ష్మి, మిష న్ భగీరథ, ఆసరా పింఛన్లు వంటి అనేక సం క్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని .. పాలనను ప్రజల ముందుకే తీసుకొచ్చేందుకు కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గిరిజ న తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛంగా మారాయన్నారు. దుద్యాల మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, దసరా కానుకగా సీఎం కేసీఆర్ కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారని, ఆయనకు ఎల్లప్పుడూ ప్రజల మద్దతు ఉండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, డీఈవో రేణుకాదేవి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్‌పాషా, ఎంపీటీసీలు నజీమున్నీసాబేగం, ఎల్ల ప్ప, తిరుపతయ్య, సర్పంచ్‌లు ఖాజా, స్వరూ ప, టీఆర్ఎస్ నాయకులు నరేశ్‌గౌడ్, బసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సీఎంకు రుణపడి ఉండాలి
దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, దేశ చరిత్రలో నిలిచిపోయే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు రుణపడి ఉండాలని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేస్తున్నారని, ఎస్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచి న్యాయం చేశారన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషకరమని.. నేడు మహిళలు ఆనందంగా పండుగను జరుపుకొంటున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ దుద్యాల మండల ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కల నెరవేరిందన్నారు. ప్రజలు వివిధ రకాల పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదన్నారు.
–సునీతామహేందర్‌రెడ్డి,జడ్పీ చైర్మన్, వికారాబాద్
అభివృద్ధి కోసమే..
పరిపాలనాసౌలభ్యం, అభివృద్ధి కోసమే ప్ర భుత్వం కొత్తగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తున్నదని మహబూబ్‌నగర్ ఎం పీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృ ద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అభివృద్ధిపథం లో ముందుకు సాగుతున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన బతుకమ్మ పండుగకు నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందంటే అది సీఎం కేసీఆర్ ఘనతే అని అన్నారు.
– మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ
టీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరిక
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాండూరుకు చెందిన 25 మంది ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు వురు ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ సం క్షేమ పథకాలు అందుతున్నాయన్నా రు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో అశ్విన్, శ్రీకాంత్, రాహుల్, వినీత్రాజ్, ఏసు, శ్రీకాంత్, శ్రీనివాస్, నరసింహ, అనిల్, సురేశ్, శ్రావణ్, సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.