వరాల జల్లుపై వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగులు
న్యూస్ నెట్వర్క్, మార్చి 16 (నమస్తే తెలంగాణ);అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాలపై బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్, మెప్మా ఉద్యోగులు సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం, సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మెప్మా, సెర్ప్ సిబ్బందికి సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో తీపి కబురు అందించడంతో ఆయా వర్గాలు బుధవారం సంబురాల్లో మునిగి తేలాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
సీఎం కేసీఆర్‌తోనే అందరికీ న్యాయం
ఇబ్రహీంపట్నం, మార్చి 16: సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవారం పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆయన్ను కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు..
శంకర్పల్లి, మార్చి 16: ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటిం చడాన్ని శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి హర్షించారు. ఈ సందర్భంగా బుధవారం ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంత రం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి, గోపాల్, వాసుదేవ్‌కన్నా, గోవర్ధన్‌రెడ్డి, యాదగిరి, శ్రీనాథ్‌గౌడ్, సంతోష్‌రాథోడ్, వెంకట్‌రెడ్డి, ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సర్కారు నౌకర్లతో సమానంగా..
ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 16: సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవారం ఇబ్రహీంపట్నం ఐకేపీ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐకేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శిరీష, ఏపీఎంలు రవీందర్, శోభ, సెర్ప్ ఉద్యోగులు నర్సింహ, కృష్ణ, చంద్రిక, రమాదేవిపాల్గొన్నారు
ఫీల్డ్ అసిస్టెంట్ల ఆనంద హేల
ఆమనగల్లు, మార్చి 16: ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో బుధవారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం ఆమనగల్లు , మాడ్గుల మండల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా సెర్ప్, మెప్మా సిబ్బంది కూడా మండల మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమం లో ఎంపీపీ అనిత, సర్పంచ్ బలరాం, ఏపీఎం కృష్ణయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు వినోద్‌రెడ్డి, కృష్ణయ్య, రమేశ్, రవీందర్, ఈశ్వరయ్య, పర్వతాలు, కృష్ణ, మహేందర్, నర్సింహ పాల్గొన్నారు.
ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్
కడ్తాల్, మార్చి 16: సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నర్సింహులు, యాదయ్య, గోపాల్, రాంచంద్రయ్య, కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకటేశ్, లక్ష్మయ్య, శ్రీను, అంజి, మహేశ్, గిరిధర్, శ్రీకాంత్, రాజశేఖర్, పురుషోత్తం పాల్గొన్నారు.